కవితకు మళ్లీ బ్యాడ్ న్యూస్... 9 బుక్స్ కావాలంట!

సీబీఐ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఆమె జ్యుడీషియల్ కస్టడీని పొడిగింది.

Update: 2024-06-07 10:41 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ జూన్ 7 వరకూ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల మొదట్లో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఆమెకు బిగ్ షాక్ తగిలింది. సీబీఐ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఆమె జ్యుడీషియల్ కస్టడీని పొడిగింది.

అవును... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న బీఆరెస్స్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో షాక్ తగిలింది. ఇందులో భాగంగా ఆమె కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు మళ్లీ పొడిగించింది. ఇందులో భాగంగా ఈ నెల 21వరకూ జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తున్నట్లు తెలిపింది.

దీంతో... ప్రస్తుతానికి మరో రెండు వారాల పాటు కవిత జైలులోనే ఉండనున్నారు. ఈ సమయంలో ఆమె కోర్టుకు ఒక విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా... జైల్లో చదువుకోవడానికి కవిత ప్రత్యేకంగా తొమ్మిది పుస్తకాలను కోరారు. ఈ నేపథ్యంలో... కవిత విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. ఆమెకు కోరిన ఆ 9 పుస్తకాలు అందించాలని ఆదేశించింది!

కాగా... ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పీ.ఎం.ఎ.ఏ సెక్షన్ 44, 45 కింది సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను ఈడీ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సుమారు 24 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు పేర్కొంది. ఇదే సమయంలో... ఇప్పటివరకూ 18 మందిని అరెస్ట్ చేశామని సీబీఐ వెల్లడించింది. ఇదే కేసులో శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని ప్రస్థావించింది.

ఇక ఈ కేసుకు సంబంధించి మొత్తం 177 పేర్జీలతో ఛార్జ్ షీట్ ఫిర్యాదు కాపీని తయారు చేయగా... 36 మందిని ఈ కేసులో నిందితులుగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేర్చింది. ఈ క్రమంలోనే కవితను 32వ నిందితురాలిగా పేర్కొంది.

Tags:    

Similar News