పిక్ టాక్... అక్క అంటే బాలయ్యకు ఎంత ప్రేమో!

చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన అక్క భుననేశ్వరిని కలిసిన బాలయ్య ఎమోషనల్ అయ్యారు.

Update: 2023-11-01 04:24 GMT

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబుకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మంగళవారం సాయంత్రం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సంద్రభంగా జైలు వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు చేరారు. ఇదే సమయంలో రాజమండ్రి నుంచి రోడ్డు మార్గంలో అమరావతికి వెళ్లే క్రమంలోనూ భారీ ఎత్తున రోడ్లకు ఇరువైపులా అభిమానులు చేరారు!


ఇలా సుమారు 53 రోజుల తర్వాత చంద్రబాబు బయటకు వస్తుండటంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే... బాబు బయటకు వస్తుండటంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవని అంటున్నారు. ఈ సందర్భంగా బాబు బయటకు రావడాన్ని విజయంగా అభివర్ణించిన భువనేశ్వరి... ఇది చంద్రబాబు విజయమో, ఆయన కుటుంబ విజయమో కాదని.. ఇది ప్రజల విజయమని, మహిళా శక్తి విజయమని చెప్పుకొచ్చారు.

ఈ సమయంలో చంద్రబాబు జైలుకి వెళ్లిన సమయంలో చాలా ఎమోషనల్ గా కనిపించిన బాలయ్య... విడుదల సమయంలోనూ బాబు కోసం జైలువద్ద ఎదురుచూశారు. ఈ సందర్భంగా చంద్రబాబు బయటకు రాగానే తన అభిమానాన్ని, ప్రేమకు, గౌరవాన్ని చూపించారు. ఈ సందర్భంగా అక్క భువనేశ్వరిని బాలయ్య నుదిటిపై ప్రేమా, ఆప్యాయతతో ముద్దు పెట్టుకుంటున్న ఫోటో వైరల్ అవుతుంది.

చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన అక్క భుననేశ్వరిని కలిసిన బాలయ్య ఎమోషనల్ అయ్యారు. తన అక్క తలపై చేతులతో నిమిరి, నుదిటిపై ముద్దుపెట్టి తన ప్రేమను, ఆత్మీయతను, సంతోషాన్ని తెలియజేశారు. దీనికి సంబంధించిన పిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. కాగా... బాలయ్య తన పెద్దకూతురు బ్రాహ్మణిని... తన అక్క భువనేశ్వరి కొడుకు లోకేష్ కి ఇచ్చి వివాహం చేసిన సంగతి తెలిసిందే!

Tags:    

Similar News