బాలయ్య నో పాలిటిక్స్... ఇక సినిమా షూటింగులే ...?

ఇంతలా హడావుడి చేసిన బాలయ్య ఇపుడు టీడీపీ జనసేన పొత్తు కుదిరి తొలి కో ఆర్డినేషన్ మీటింగ్ జరిగితే మాత్రం కనిపించలేదు.

Update: 2023-10-24 10:49 GMT

ఏపీలో రాజకీయం వేడెక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు రెండు పండుగలు జైలులోనే గడచిపోయాయి. వినాయక చవితి, దసరా పండుగలు ఆయన జైలు గోడల మధ్యనే గడిపారు. బాబు అరెస్ట్ అయిన వెంటనే బాలక్రిష్ణ తన సినిమా షూటింగ్స్ సైతం ఆపుకుని మరీ ఏపీకి వచ్చారు. బాబు అరెస్ట్ మీద ఘాటైన విమర్శలు చేస్తూ వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరికలూ జారీ చేశారు.

బావ జైలును తట్టుకోలేక మరణించిన వారిని పరామర్శించేందుకు తాను రెడీ అని ప్రకటించారు. ఆ తరువాత జైలులో బాలయ్య బాబుని కలసి వచ్చారు. ఇక ఏపీలో టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ ఒకటి ఏర్పాటు అయింది. దాంటో బాలయ్య మెంబర్ గా ఉన్నారు. తొలి మీటింగ్ నంద్యాలలో జరిగితే అటెండ్ అయ్యారు.

ఇంతలా హడావుడి చేసిన బాలయ్య ఇపుడు టీడీపీ జనసేన పొత్తు కుదిరి తొలి కో ఆర్డినేషన్ మీటింగ్ జరిగితే మాత్రం కనిపించలేదు. నిజానికి కో ఆర్డినేషన్ కమిటీలో బాలయ్య పేరు లేదు. దాంతో పాటు బాలయ్య తన కొత్త సినిమా ప్రమోషన్ లో బిజీ అయిపోయారు. సినిమా రిలీజ్ అయి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. సక్సెస్ మీట్ లో ఇపుడు బాలయ్య బిజీ అయిపోయారు.

లేటెస్ట్ గా జరిగిన సక్సెస్ మీట్ లో బాలయ్య మాట్లాడుతూ భగవంత్ కేసరి మూవీ హిట్ అయింది, ఇక తన ఆలోచనలు కొత్త సినిమా మీదనే అని స్టేజ్ మీదనే చెప్పేశారు. తరువాత సినిమా బాబీ డైరెక్షన్ లో ఉందని, ఆ సినిమా షూటింగ్ కి తాను ప్రిపేర్ అవుతున్నానని, వచ్చే నెల నుంచి షూటింగ్ లో జాయిన్ అవుతున్నానని బాలయ్య ప్రకటించారు.

అంటే బాలయ్య ఇపుడు మళ్లీ షూటింగ్స్ తో బిజీ అవుతారు అని అంటున్నారు. నిజానికి బాబు అరెస్ట్ తరువాత బాలయ్య రాజకీయంగా బిజీ అవుతారని, ఫలితంగా భగవంత్ కేసరి మూవీ రిలీజ్ కూడా అవుతుందా లేదా అన్న టెన్షన్ కూడా మొదట్లో ఉండేది. అయితే బాలయ్య ఆ మూవీలో పెండింగ్ వర్క్ ని ఫినిష్ చేయడానికి ముందుకు వచ్చారు. అలా ఆ మూవీ రిలీజ్ కి ఇబ్బంది లేదు అనుకుంటే టీడీపీలో రాజకీయ పరిణామాల వల్ల కూడా బాలయ్య ఇక పూర్తిగా సినిమాలకే పరిమితం అయిపోయారని అంటున్నారు.

ఊహించని విధంగా పూర్తి స్థాయిలో భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్ కి బాలయ్య ఫుల్ టైం ఇచ్చేసారు. ఇపుడు తరువాత చిత్రం లో బిజీ అంటున్నారు. మరి ఏపీ రాజకీయాల్లో బాలయ్య దూకుడు పెంచరా అన్న చర్చ అయితే సాగుతోంది. అంతే కాదు, బాబు జైలు నుంచి బయటకు రాలేదు, బాలయ్య ఏపీలో టీడీపీ పక్షాన నిలబడి సభలూ సమావేశాలూ నిర్వహిస్తారు అని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు అంటే ఎక్కడో తేడా కొడుతోంది అని అంటున్నారు.

నిజానికి బాలయ్యకు టీడీపీ తరఫున జనంలోకి రావాలని ఉన్నా అక్కడ అవకాశాలే లేవని అంటున్నారు. లోకేష్ భువనేశ్వరి ఇద్దరూ జనంలోకి వెళ్తున్నారు. దాంతో తన అవసరం లేదని ఆయన భావించారో లేక తాను సినిమాలకే పరిమితం అయితే చాలు అనుకున్నారో బాబీ మూవీకి కంప్లీట్ మేకోవర్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయారు. ఫుల్ గా నీట్ గా షేవ్ చేసుకుని మరీ బాలయ్య కొత్త గెటప్ లో భగవంత్ కేసరి సక్సెస్ మీట్ లో కనిపించారు. తన మనసు అంతా కొత్త సినిమాకే అని బాలయ్య చెప్పడంతో ఇక నో పాలిటిక్స్ అని ఆయనే చెప్పినట్లు అయింది అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే బాలయ్యను టీడీపీ దూరం పెట్టిందా లేక ఆయనే దూరం జరుగుతున్నారా అన్నది తెలియడం లేదు కానీ టీడీపీ కి ఎమ్మెల్యేగా ఉంటూ, బాబుకు వియ్యంకుడిగా ఉన్న బాలయ్య ఇపుడు సినిమాలకే ఓటు అంటున్నారు అంటే టీడీపీ నారా వారి పార్టీ అని అర్ధం అయిందా అనందే చర్చగా ఉంది మరి.

Tags:    

Similar News