బ్యాంక్ ఉద్యోగం మానేసింది... ఆ దొంగతనాలు మొదలుపెట్టింది!
అవును... బంగారం లాంటి బ్యాంక్ ఉద్యోగం చేసుకుంటున్న మహిళ.. ఉన్నపలంగా ఆ జాబ్ కు రిజైన్ చేసిందంట
కొంతమందికి వారు చేస్తున్న ఉద్యోగం తప్ప మిగిలినవన్నీ సులువైన ఉద్యోగాలే అనుకుంటుంటారు! మరికొంతమంది... తాను ఉద్యోగం చేస్తూ ఫిక్స్డ్ జీతానికి ఫిక్స్ అయిపోయాను.. డబ్బులు సంపాదించడానికి ఇంకా ఎన్నో సులువైన మార్గాలున్నాయని ఆలోచించి మొదటికే మోసం తెచ్చుకుంటుంటారు. ఈ క్రమంలో బెంగళూరులో ఒక మహిళ కూడా అలానే ఆలోచించినట్లుంది. చేస్తున్న ఉద్యోగం మానేసి దొంగతనాలకు అలవాటుపడింది!
అవును... బంగారం లాంటి బ్యాంక్ ఉద్యోగం చేసుకుంటున్న మహిళ.. ఉన్నపలంగా ఆ జాబ్ కు రిజైన్ చేసిందంట. అనంతరం... ల్యాప్ ట్యాప్ ల దొంగతనంపై దృష్టి పెట్టిందంట. ఇందులో భాగంగా పలు ఐటీ కంపెనీల్లోనూ, తాను ఉంటున్న వర్కింగ్ ఉమన్స్ హాస్టల్ (పీజీ) ల్లోనూ ల్యాప్ టాప్ లను దొంగిలించడం మొదలుపెట్టిందంట. అయితే... దొంగ అన్నతర్వాత ఎప్పటికైనా దొరకడం తప్పదు కాబట్టి.. ఈమె విషయంలోనూ అదే జరిగింది!
నివేదికల ప్రకారం... బెంగళూరుకు చెందిన ఒక మహిళ (26) బ్యాంక్ లో ఉద్యోగం చేసేది. ఈ క్రమంలో ఏడాది క్రితం ఆ ఉద్యోగానికి రాజీనామా చేసింది. అక్కడ నుంచి సీరియల్ దొంగగా మారింది. ఇందులో భాగంగా... బెంగళూరులోని తాను ఉంటున్న పీజీలోని మహిళల ల్యాప్ టాప్ లను దొంగిలించడం మొదలుపెట్టింది. డిన్నర్ టైం లో అంతా భోజనానికి వెళ్లిన సమయంలో... తన పని ముగించేదంట!
ఈ క్రమంలో దొంగిలించిన ల్యాప్ టాప్ లను అమ్మడానికి తన స్వగ్రామమైన నొయిడాకు వెళ్లేదంట. ఆ తర్వాత తిరిగి బెంగళూరుకు వచ్చి మరో పీజీలో జాయిన్ అయ్యి... అక్కడ మళ్లీ స్టార్ట్ చేస్తుందంట. ఇలా ఇటీవల కాలంలో సుమారు 10 లక్షల రూపాయల విలువైన 24 ల్యాప్ టాప్ లను ఆమె దొంగిలించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 26న బాధితురాలు ఆమెపై ఫిర్యాదు చేయడంతో... పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు!