యూఎస్ ఎన్నికల్లో బెట్టింగ్ యాప్ లు చెబుతోన్నది నిజమేనా?

అయితే.. బెట్టింగ్ యాప్ లో మాత్రం ట్రంప్ కు గుడ్ న్యూస్ చెబుతున్నాయి!

Update: 2024-10-24 16:38 GMT

నవంబర్ 5న అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ల మధ్య పోరు అత్యంత రసవత్తరంగా ఉందని అంటున్నారు! పోల్స్ అంచనాల ప్రకారం హారిస్ కాస్త ముందంజలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే.. బెట్టింగ్ యాప్ లో మాత్రం ట్రంప్ కు గుడ్ న్యూస్ చెబుతున్నాయి!

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోరు హోరా హోరుగా ఉండనుందనేది ఇప్పటికే స్పష్టమైన పరిస్థితి. వార్ ఎట్టిపరిస్థితుల్లోనూ వన్ సైడ్ కాదని స్పష్టమవుతూనే ఉంది. ఈ సమయంలో కీలకమైన రాష్ట్రాల్లో హారిస్, ట్రంప్ మధ్య భీకర పోరు ఉందని అంటూనే... హారిస్ కు కాస్త ఎడ్జ్ ఉందని చెబుతున్నారు.

అయితే ఇటీవల వెలువడిన ఒపీనియన్ పోల్స్ లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ వైపు అమెరికన్లు కాస్త మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. మెక్ డొనాల్డ్ లో ట్రంప్ చేసిన హడావిడి ఆయనకు కలిసొచ్చిందని అంటున్నారు. ఈ వ్యవహారం అనంతరం డొనాల్డ్ ట్రంప్ విజయావకాశాలు మరింత పెరిగాయని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలోని బెట్టింగ్ యాప్ లో ట్రంప్ విజయావకాశాలు ట్రెండ్ పెరిగిందని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ట్రంప్ గెలవబోతున్నారని బెట్టింగ్ యాప్ లు దాదాపు ఏకగ్రీవంగా పేర్కొంటున్న పరిస్థితి. వాస్తవానికి ఫ్యాక్స్ న్యూస్ వంటివి మినహా యూఎస్ లోని ప్రధాన మీడియా ట్రంప్ కు వ్యతిరేకంగా ఉందని అంటున్నారు.

మరోపక్క పోల్స్ అంచనాలు కూడా ట్రంప్ కాస్త వెనుకబడ్డారనే ఫలితాలే ఇస్తున్నాయి. కాకపోతే హారిస్ కు కొద్ది పాటి తేడా దూరంలోనే ఉన్నారు! అయితే బెట్టింగ్ యాప్ లు మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. దీంతో... ఇవి నిజమైన నమ్మకాలను ప్రతిబింబిస్తున్నాయా లేక, లాభాలను ఆర్జించడానికి ఇలా తారుమారు చేసి చెబుతున్నాయా అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఏది ఏమైనా... బెట్టింగ్ యాప్ లు ట్రంప్ కు వేస్తోన్న పెద్ద పీట ఆయనతో పాటు రిపబ్లికన్స్ కి పెద్ద బూస్టింగ్ అని.. ఈ అంచనాలు వాస్తవరూపం దాల్చాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి.. యూఎస్ కు ట్రంప్ మరోసారి ప్రెసిడెంట్ అవుతారా.. లేక, ముందుగా ప్రకటించినట్లుగా ఇకపై రాజకీయాల నుంచి తప్పుకుంటారా అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News