భారతరత్న అందుకున్న 50 మంది వీరే!
తాజాగా కొద్దిరోజుల క్రితం బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఎల్కే అద్వానీని కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది
బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ (ఎల్కే అద్వానీ)కి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించిన సంగతి తెలిసిందే. అద్వానీతో కలిపి ఇప్పటివరకు 50 మంది ‘భారతరత్న’ను అందుకున్నారు. ఈ 50 మందిలో 17 మందికి వారి మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు పలువురికి ‘భారతరత్న’ లభించింది. తాజాగా కొద్దిరోజుల క్రితం బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. ఇప్పుడు ఎల్కే అద్వానీని కూడా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది.
ఇప్పటివరకు ‘భారతరత్న’ అందుకున్నవారు వీరే..
1. చక్రవర్తి రాజగోపాలాచారి (స్వతంత్ర భారతదేశానికి తొలి భారత గవర్నర్ జనరల్)– 1954
2. సర్వేపల్లి రాధాకృష్ణన్ (భారత మాజీ రాష్ట్రపతి)– 1954
3. సీవీ రామన్ (విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత)– 1954
4. భగవాన్ దాస్ (స్వాతంత్య్ర పోరాట యోధుడు, తత్వవేత్త, విద్యావేత్త)– 1955
5. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (ప్రముఖ సివిల్ ఇంజనీర్, రాజకీయవేత్త)– 1955
6. జవహర్లాల్ నెహ్రూ (స్వాతంత్య్ర సమర యోధుడు, భారతదేశ మొదటి ప్రధాని ప్రధాని)– 1955
7. గోవింద్ వల్లభ్ పంత్ (స్వాతంత్య్ర సమరయోధుడు, ఉత్తరప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి)– 1957
8. ధోండో కేశవ్ కర్వే (సంఘ సంస్కర్త, విద్యావేత్త)– 1958
9. బీసీ రాయ్ (వైద్యుడు, విద్యావేత్త, పశ్చిమ బెంగాల్ రెండో సీఎం) – 1961
10. పురుషోత్తం దాస్ టాండన్ (స్వాతంత్య్ర సమర యోధుడు)– 1961
11. బాబూ రాజేంద్ర ప్రసాద్ (స్వాతంత్య్ర సమర యోధుడు, భారతదేశ తొలి రాష్ట్రపతి)– 1962
12. జాకీర్ హుస్సేన్ (స్వాతంత్య్ర పోరాట యోధుడు, భారతదేశ మూడో ప్రధానమంత్రి)– 1963
13. పాండురంగ్ వామన్ కేన్ (సంస్కృత పండితుడు)–1963
14. లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (స్వాతంత్య్ర సమర యోధుడు, భారతదేశ రెండో ప్రధాని) – 1966
15. ఇందిరా గాంధీ (రాజకీయనేత, భారతదేశ మొదటి మహిళా ప్రధానమంత్రి)–1971
16. వరాహగిరి వెంకట గిరి (స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ రాష్ట్రపతి)–1975
17. కె.కామరాజ్ (మరణానంతరం) (రాజకీయవేత్త, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి) – 1976
18. మదర్ థెరిసా (సంఘసేవకురాలు) – 1980
19. వినోబా భావే (మరణానంతరం) (స్వాతంత్య్ర పోరాట యోధుడు, సంఘ సంస్కర్త)–1983
20. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (స్వాతంత్య్ర పోరాట యోధుడు, సరిహద్దు గాంధీ బిరుదాంకితులు)–1987
21. ఎంజీ రామచంద్రన్ (మరణానంతరం) (విఖ్యాత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి)–1988
22. బీఆర్ అంబేద్కర్ (మరణానంతరం) (రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు)–1990
23. నెల్సన్ మండేలా (దక్షిణాఫ్రికా వర్ణవివక్ష వ్యతిరేక పోరాట నేత)– 1990
24. రాజీవ్ గాంధీ (మరణానంతరం) (రాజకీయనేత, భారత మాజీ ప్రధాని)–1991
25. సర్దార్ వల్లభాయ్ పటేల్ (మరణానంతరం) (స్వాతంత్య్ర పోరాట యోధుడు, దేశ తొలి ఉప ప్రధాని)– 1991
26. మొరార్జీ దేశాయ్ (మరణానంతరం) (తొలి కాంగ్రేసేతర భారత ప్రధాని)– 1991
27. మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మరణానంతరం) (స్వాతంత్య్ర పోరాట యోధుడు, దేశ తొలి విద్యా శాఖ మంత్రి)–1992
28. జేఆర్డీ టాటా (ప్రముఖ పారిశ్రామికవేత్త)– 1992
29. సత్యజిత్ రే (ప్రముఖ దర్శకుడు)– 1992
30. గుల్జారీ లాల్ నందా (స్వాతంత్య్ర పోరాట యోధుడు, దేశ తాత్కాలిక ప్రధానిగా పనిచేశారు)– 1997
31. అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు)– 1997
32. ఎ.పి.జె. అబ్దుల్ కలాం (క్షిపణి శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)–1997
33. ఎంఎస్ సుబ్బులక్ష్మి (కర్ణాటక శాస్త్రీయ విద్వాంసురాలు)–1998
34. చిదంబరం సుబ్రమణ్యం (స్వాతంత్య్ర పోరాట యోధుడు)– 1998
35. జయప్రకాష్ నారాయణ్ (మరణానంతరం) (స్వాతంత్య్ర పోరాట యోధుడు, సంఘ సంస్కర్త)– 1999
36. అమర్త్య సేన్ (ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత)– 1999
37. గోపీనాథ్ బోర్డోలోయ్ (మరణానంతరం) (స్వాతంత్య్ర పోరాట యోధుడు) – 1999
38. పండిట్ రవిశంకర్ (ప్రముఖ సంగీత విద్వాంసుడు) – 1999
39. లతా మంగేష్కర్ (విఖ్యాత గాయని)– 2001
40. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ (ప్రముఖ సంగీత విద్వాంసుడు)– 2001
41. భీంసేన్ జోషి (ప్రముఖ గాయకుడు, విద్వాంసుడు)– 2009
42. సీఎన్ఆర్ రావు (ప్రముఖ శాస్త్రవేత్త)– 2014
43. సచిన్ టెండూల్కర్ (క్రికెటర్)– 2014
44. అటల్ బిహారీ వాజ్పేయి (రాజకీయ నేత, భారత మాజీ ప్రధాని)– 2015
45. మదన్ మోహన్ మాలవీయ (మరణానంతరం) (పండితులు, విద్యావేత్త, సంఫ సంస్కర్త)– 2015
46. నానాజీ దేశ్ముఖ్ (మరణానంతరం) (సామాజిక కార్యకర్త)– 2019
47. భూపేంద్ర కుమార్ హజారికా (మరణానంతరం) (ప్రముఖ గాయకుడు, గేయ రచయిత, సంగీతకారుడు, కవి) – 2019
48. ప్రణబ్ ముఖర్జీ (రాజకీయనేత, భారత మాజీ రాష్ట్రపతి)– 2019
49. కర్పూరి ఠాకూర్ (మరణానంతరం) (రాజకీయనేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి) – 2024
50. ఎల్కే అద్వానీ(రాజకీయ నేత, భారత మాజీ ఉప ప్రధాని)–2024