''బీఆర్ఎస్ మాదిరిగా మేం ఉండం''
అందుకే.. వారికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని.. అసెంబ్లీలోనూ మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.
''గతంలో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అనుసరించినట్టుగా మేం వ్యవహరించం. మాకు విజ్ఞత ఉంది. దానిని పాటి స్తాం. విపక్షాల గొంతు నొక్కింది.. కేసీఆరే'' అని కాంగ్రెస్ నేత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు.. పరిస్థితులపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలంటే తమకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. అందుకే.. వారికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నామని.. అసెంబ్లీలోనూ మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.
కానీ, కేసీఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలన్న కుట్ర సాగిందన్నారు. అందుకే.. సీఎల్పీని విలీనం చేసుకున్నట్టు ప్రకటించారని తెలిపారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దిక్కుమాలిన రాజ కీయాలు ఎప్పటికీ చేయబోదని భట్టి చెప్పారు. ``ప్రజాస్వామ్యాన్ని వారి(బీఆర్ ఎస్) మాదిరిగా ఖూనీ చేయం. పరిర క్షిస్తున్నాం. సభలో మాట్లాడేందుకు.. అవకాశం ఇస్తున్నాం. కానీ, వారు గత పదేళ్లలో ఏం చేశారో.. ఆలోచించుకోవా లి`` అని భట్టి వ్యాఖ్యానించారు.
ఇక, ఎమ్మెల్యేలు.. కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీల వివాదంపై మాట్లాడుతూ.. బాధ్యతగల ఎమ్మెల్యేలు ఇలా రోడ్డెక్క డాన్ని వ్యక్తిగతంగా తాను ఖండిస్తున్నట్టు చెప్పారు. ``బాధ్యత కలిగిన ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం నన్ను బాధ పెట్టింది. ఎమ్మెల్యేలైనా.. ఎవరైనా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు`` అని భట్టి హెచ్చరించారు. రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్న సమయంలో ఒక పద్ధతి ప్రకారం.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్రలను సహించేది లేదని కూడా భట్టి పేర్కొన్నారు. ప్రతిపక్షం ఉండాలనే తాము కోరుకుంటున్నామని.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా తాము వాల్యూ ఇస్తామనిచెప్పారు. కానీ.. వారు పద్ధతిగా రాజకీ యాలు చేయాలని సూచించారు. పద్ధతి లేని నాయకులు, వ్యక్తులు సమాజానికి బరువు అవుతారని చెప్పారు. కరీంనగర్‌లో పర్యటించిన భట్టి.. రాష్ట్ర పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతగా వ్యవహరించాలనిఆయన ఎమ్మెల్యేలకు సూచించారు.