భవీశ్ వర్సెస్ కునాల్... ఓలా ఎలక్ట్రిక్ షేర్లపై ఎక్స్ వార్ ఎఫెక్ట్!

ఇప్పటికే 43% తగ్గిన షేర్లు నేడు 9% వరకూ క్రాష్ అయ్యాయి

Update: 2024-10-08 02:45 GMT

ఆన్ లైన్ వేదికగా జరిగిన ఓ ట్వీట్స్ వార్ ఏకంగా ఆ కంపెనీ షేర్లు గరిష్ట స్థాయిలో క్షీణించడానికి కారణమైన అంశం ఇప్పుడు నెట్టింట, బిజినెస్ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి. ఇప్పటికే 43% తగ్గిన షేర్లు నేడు 9% వరకూ క్రాష్ అయ్యాయి. దీంతో... ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది.

అవును... ఎలక్ట్రికల్ టూవీలర్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ షేర్లు మరోసారి పతనమయ్యాయి. ఇటీవల స్టాక్ ఎక్స్ ఛేంజ్ లో నమోదైన ఈ కంపెనీ.. సుమారు 43% క్షీణించింది. కంపెనీ సేవలపై ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న ఫిర్యాదులు దీనికి కారణమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇదే సమయంలో సోమవారం సైతం కంపెనీ షేర్ల్ 9 శాతం వరకూ క్షీణించి రూ.90.37 వద్ద ట్రేడవుతున్నాయి! ఈ విషయాలపై స్పందించిన విశ్లేషకులు... ఓలా కంపెనీ సీఇవో భవీశ్ అగర్వాల్, ప్రముఖ స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రూ మధ్య ఎక్స్ వేదికగా నడిచిన వివాదమే కారణమని అంటున్నారు!

కాగా ఓలాకు తగినన్ని సర్వీసు సెంటర్లు లేవని.. దీంతో కస్టమర్లు విసుగు చెందుతున్నారని పెర్కొంటూ తొలుత కమెడియన్ కునాల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన భవిశ్ అగర్వాల్... నీ కామెడీ కెరీర్ పూర్తవ్వడంతో ఇలాంటి పెయిడ్ పోస్టులు పెడుతున్నావా అంటూ ఫైర్ అయ్యారు.

ఇదే సమయంలో ఓలా సర్వీసు స్టేషన్ల వద్ద విధులు నిర్వహిస్తే... కామెడీ షోల కంటే ఎక్కువ మొత్తం ఇస్తానంటూ విరుచుకుపడ్డారు. దీనిపై స్పందించిన కునాల్... అసంతృప్తిలో ఉన్న కస్టమర్లకు పూర్తి రీఫండ్ ఇవ్వగలరా అని అదేస్థాయిలో స్పందించిన పరిస్థితి.

ఇలా సీఈవో, కమెడియన్ల మధ్య నెలకొన్న ఈ మాటల యుద్ధం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో కమెడియన్ మాటలతో పలువురు ఏకీభవించగా.. మరికొంతమంది సీఈవో కు అండగా నిలిచారు. వీరి వాదన అలా ఉంటే... ఈ ఎఫెక్ట్ కంపెనీ షేర్లు పతనమైపోవడానికి కారణమైఅందనే అభిప్రాయాలే తెరపైకి వస్తున్నాయి.

Tags:    

Similar News