బాబు కోసం.. నారా భువనేశ్వరి నిరాహార దీక్ష...!

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత‌, తన భర్త నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా... అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు నారా భువనేశ్వరి నిరాహారదీక్ష చేపట్టనున్నారు.

Update: 2023-09-30 12:53 GMT

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత‌, తన భర్త నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా... అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు నారా భువనేశ్వరి నిరాహారదీక్ష చేపట్టనున్నారు. ఆ రోజు ఉద‌యం మ‌హాత్మా గాంధీ విగ్ర‌హానికి పూల మాల‌లు స‌మ‌ర్పించి.. అనంత‌రం ఆమె నిరాహార దీక్ష చేప‌ట్ట‌నున్న‌ట్టు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు ప్రకటించారు.

అంతేకాదు, ఈ నిరాహార దీక్ష‌కు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కూడా నిరాహా ర దీక్ష‌ల్లో పాల్గొనే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ముఖ్య నాయ‌కులు అంద‌రూ నిరాహార దీక్ష‌లో పాల్గొంటా ర‌ని అదేవిధంగా జిల్లా కేంద్రాలు, మండ‌ల స్థాయిలో కూడా అక్టోబ‌రు 2న పార్టీ నాయ‌కులు నిరాహార దీక్ష‌లు చేప‌ట్ట‌నున్న‌ట్టు వివ‌రించారు.

ఆదే రోజు రాత్రి 7గంట‌ల నుంచి 5 నిమిషాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జ‌లు త‌మ ఇళ్ళల్లోని లైట్లు ఆర్పి, ఆరుబయట కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబుకు తమ సంఘీభావం ప్రకటించాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్టును ప్ర‌తి ఒక్క‌రూ ఖండించాల‌ని ఆయ‌న సూచించారు. ఈ ఉద్య‌మంలో తెలుగు వారి ఆత్మ గౌర‌వం ఇనుమ‌డించాల‌ని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News