ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ని చూశారా?.. భారత సంతతి యూట్యూబర్ రికార్డ్!
వివరాళ్లోకి వెళ్తే... మిస్టర్ హూస్ దబాస్ పేరిట టెక్నాలజీకి సంబంధించిన ఇన్ ఫర్మేషన్ ను అందిస్తూ యూట్యూబ్ లో పేరు సంపాదించాడు అరుణ్ మైనీ.
ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఐఫోన్ ని ఎప్పుడైనా చూశారా? తాజాగా భారీ సైజులో ఓ ఐఫోన్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. అది రూపొందించింది బ్రిటన్ లోని భారత సంతతికి చెందిన టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ మైనీ. దీని పొడవు ఏకంగా 6.74 అడుగుల పొడవు కాగా.. ఇది ఐ ఫోన్ 15 ప్రో మ్యాక్స్ కు ప్రతిరూపంగా ఇప్పుడు గిన్నీస్ రికార్డ్స్ లోకి ఎక్కింది.
అవును... ప్రపంచవ్యాప్తంగా యాపి సంస్థ తయారు చేసే ఐఫోన్ లకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పే పనిలేదు! ఈ సంస్థ తయారు చేసే ప్రోడక్స్ ను దక్కించుకోవడం, ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుండటం చాలా మంది లైఫ్ స్టైల్లో ఓ భాగంగా... ఈ సమయంలో అరుణ్ మైనీ అనే టెక్ కంటెంట్ క్రియేటర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ప్రతిరూపాన్ని రూపొందించి గిన్నీస్స్ రికార్డ్ క్రియేట్ చేశాడు.
వివరాళ్లోకి వెళ్తే... మిస్టర్ హూస్ దబాస్ పేరిట టెక్నాలజీకి సంబంధించిన ఇన్ ఫర్మేషన్ ను అందిస్తూ యూట్యూబ్ లో పేరు సంపాదించాడు అరుణ్ మైనీ. ఈ క్రమంలోనే మాథ్యూ పెర్క్స్ అనే గ్యాడెట్ స్పెషలిస్ట్ తో కలిసి ఓ భారీ ఐ ఫోన్ రూపాన్ని తయారు చేశాడు. ఐఫోన్ 15 మ్యాక్స్ ను 6.7 అంగుళాల స్క్రీన్ తో ఇస్తుండగా.. దానికి ప్రతిరూపంగా తయారుచేసిన దీన్ని 6.74 అడుగుల పొడవుతో భారీ కెమెరాలతో తీర్చిదిద్దారు!
గేమింగ్ యాప్ లను కూడా ఉపయోగించుకునేలా రూపొందించిన ఈ భారీ ఐఫోన్ ప్రతిరూపాన్ని స్టాండ్స్ పై అమర్చి స్థానిక వీధుల్లోకి తీసుకెళ్లారు. దీంతో ఆశచర్యపోవడం ప్రజల వంతైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.