అమెరికాలో ఘోర బైక్ ప్రమాదం... తెలుగు వ్యక్తి స్పాట్ డెడ్!
ఇలా మోటార్ సైకిల్ ప్రమాదానికి సంబంధించి నివేదిక అందిన వెంటనే బ్రిట్జ్ పోర్ట్ ఫైర్ ఇంజిన్, అమెరికన్ మెడికల్ రెస్పాన్స్, బ్రిడ్జ్ పోర్ట్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అమెరికాలో వివిధ ప్రమాదాల్లో మరణిస్తున్న భారతీయులు, తెలుగువారి జాబితాలో మరో ఘటన వచ్చి చేరింది. అత్యంత విషాదకరమైన విషయాలు యూఎస్ లో నిత్యం ఏదో ఓ మూల జరుగుతుండటం గమనార్హం. ఈ క్రమంలో తాజాగా ఓ బైక్ పై వెళ్తున్న ఓ జంట తెల్లావారుజామున ఒంటి గంటా ప్రాంతంలో ప్రమాదానికి గురైంది! వారిలో ఒకరు తెలుగువారని తెలుస్తోంది.
అవును... గురువారం తెల్లవారుజామున 1:05 గంటల ప్రాంతంలో వాల్టెమోర్ అవెనూ, అట్లాంటిక్ స్ట్రీట్ జంక్షన్ వద్ద మోటార్ సైకిల్ క్రాష్ అయినట్లు బ్రిడ్ పోర్ట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ కు నివేదిక అందిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు!
ఇలా మోటార్ సైకిల్ ప్రమాదానికి సంబంధించి నివేదిక అందిన వెంటనే బ్రిట్జ్ పోర్ట్ ఫైర్ ఇంజిన్, అమెరికన్ మెడికల్ రెస్పాన్స్, బ్రిడ్జ్ పోర్ట్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ సమయానికి అట్లాంటిక్ స్ట్రీట్ సమీపంలోని రోడ్డు పక్కన పడి ఉన్న బైక్ పక్కనే ఇద్దరు వ్యక్తులు అచేతన స్థితిలో పడి ఉండటాన్ని అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు.
ఆ సమయంలో అమెరికన్ మెడికల్ రెస్పాన్స్ కి చెందిన ఇద్దరు సిబ్బంది ఆ ఇద్దరు వ్యక్తులను పరిశీలించారు. అయితే.. అప్పటికే వారు మరణించారని చెబుతున్నారు. అంటే... ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్ డెడ్ అయ్యి ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా మృతుల వివరాలను పోలీసులు వెళ్లడించారు.
బ్రిడ్జ్ పోర్ట్ పోలీసులు వెళ్లడించిన వివరాల ప్రకారం... ఈ ప్రమాదం తెల్లవారుజామున 1:05 గంటల ప్రాంతంలో జరిగింది. మృతులను రోహిత్ గురుమూర్తి (29), అతనితో పాటు ప్రయాణించిన మహిళను 23 ఏళ్ల జవేరియా షేక్ గా గుర్తించినట్లు చెబుతున్నారు. వీరిలో రోహిత్ గురుమూర్తి తెలుగువారని అంటున్నారు!
ప్రమాదానికి కారణమైన బైక్ ను 2016 మోడల్ బ్లాక్ డుకాటీ స్క్రాంబ్లర్ 800 గా చెబుతున్నారు! ఈ సమయంలో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు!