ఏపీతో ఒప్పందం.. బిల్ గేట్స్ ట్వీట్ వైరల్

ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలపై అపర కుబేరుడు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆనందం వ్యక్తం చేశారు.;

Update: 2025-03-20 08:55 GMT

ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలపై అపర కుబేరుడు గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ ఆనందం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన బిల్ గేట్స్ ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం విద్య, వైద్యం, వ్యవసాయరంగాల్లో సహకారం అందిస్తామన్నారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఇండియా, ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగిందని, దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ కు తమ సహకారం ఎప్పుడూ కొనసాగిస్తామని గేట్స్ చెప్పారు.గేట్స్ ఫౌండేషన్ తో జరిగిన సమావేశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ బిల్ గేట్స్ రీ ట్వీట్ చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, బిల్ గేట్స్ మధ్య ఢిల్లీలో బుధవారం కీలక భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఆరోగ్య సంరక్షణ, మెడికల్ టెక్నాలజీ, విద్య వ్యవసాయం వంటి రంగాల్లో టెక్నాలజీ వినియోగం పెంపొందించే విషయంలో సహకరిస్తానని బిల్ గేట్స్ హామీ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునాతన సాంకేతికత వినియోగంపైనా ఉమ్మడిగా కార్యాచరణ ప్రారంభించాలని ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు.

దాదాపు గంట పాటు జరిగిన సమావేశంలో ఏపీ అభివృద్ధికి బిల్ గేట్స్ సహకరిస్తానని హామీ ఇవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. బిల్ గేట్స్ తో చంద్రబాబుకు దాదాపు 30 ఏళ్ల ఉంది. తొలిసారిగా బిల్ గేట్స్ ను ఏపీకి తీసుకువచ్చి మైక్రోసాఫ్ట్ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఉమ్మడి ఏపీలో ఐటీ చాలా అభివృద్ధి చెందిందని చెబుతారు. ప్రస్తుతం ఏఐ శకం నడుస్తుండటంతో బిల్ గేట్స్ సహకారం తీసుకోవాలని నిర్ణయించడంతో ఆ రంగంలో ఏపీపై అంచనాలు పెరిగాయి.

Tags:    

Similar News