హర్యానా ప్రజలను భయపెడుతున్న బీజేపీ
దేశంలో రెండు రాష్ట్ర శాసనసభలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి.
దేశంలో రెండు రాష్ట్ర శాసనసభలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. బీజేపీ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ప్రజల ఆలోచన అనో తీర్పు అనో ఇండియా కూటమి చెప్పదలచింది అని అంటున్నారు.
అయితే అసెంబ్లీ ఎన్నికలు ఎపుడూ లోకల్ ఇష్యూల మీద జరుగుతాయి. కర్ణాటక చూస్తే అసెంబ్లీలో బీజేపీ ఓడినా ఎంపీ ఎన్నికల్లో గెలిచింది. అలాగే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఎనిమిది సీట్లకు పరిమితం అయిన బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ సీట్లను సొంతం చేసుకుంది.
అందువల్ల్ల అసెంబ్లీ ఎన్నికల తేరు వేరు అని సరిపెట్టుకోవచ్చు. కానీ బీజేపీని మోడీని ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే మోడే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చాలా గట్టిగా చేస్తారు. పైగా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరూ బీజేపీ తరఫున ముందే ప్రకటించారు. లోకల్ లీడర్ షిప్ ని అలా ఉంచి మోడీ అమిత్ షావే రంగంలోకి దిగుతారు.
దాంతో ఆ క్రెడిట్ అయినా లేక డెబిట్ అయినా అది కచ్చితంగా బీజేపీ ఖాతాలోనే పడుతున్నారు. మరో వైపు చూస్తే కాశ్మీర్ ఎన్నికలు పూర్తిగా కేంద్రంలోని బీజేపీకి రిఫరెండమే. ఎందుకంటే 370 అధికరణను బీజేపీ రద్దు చేసింది. దానికి స్థానిక ప్రజలు కోరుకున్నారు అంది. తమకే అందరి మద్దతు అని కూడా చెప్పింది.
అలా కాశ్మీరు ఫలితం ఏదైనా బీజేపీ డైరెక్ట్ గానే బాధ్యత తీసుకోవాలి. ఇక హర్యానా విషయం తీసుకుంటే రెండు సార్లు బీజేపీ అధికారంలో ఉంది. దాంతో ఈసారి గెలవకపోతే బీజేపీ మీద జనాలకు మొత్తింది అంటారు. మోడీ వచ్చి ప్రచారం చేసినా జనాలు మాట వినలేదు అంటే కేంద్రం మీద కూడా వ్యతిరేకత ఉంది అని అంటారు.
aఈ విషయాలు ఏవీ బీజేపీకి తెలియనివి కాదు, అందుకే ఈ రెండు రాష్ట్రాలు తమకు ఎంత ప్రతిష్టాత్మకమో తెలిసిన మీదటనే వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు సాగుతోంది. హర్యానా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన నరేంద్ర మోడీకి అక్కడ పరిస్థితి అర్థం అయిందా అన్నది కూడా చర్చకు వస్తోంది.
అందుకే ఆయన తొలి సభలోనే ప్రజలను హెచ్చరించే విధంగా మాట్లాడారు. పొరపాటున కాంగ్రెస్ కి ఓటు వేస్తే హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి వస్తుందని కూడా భయపెట్టేలా మాట్లాడారు అని అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం దివాళా తీసిందని అదే పరిస్థితిని తెచ్చుకోవద్దు అని మోడీ గట్టిగానే చెబుతున్నారు. కాంగ్రెస్ కి ఓటేస్తే హర్యానా కూడా దివాళా తీస్తుందని కూడా చెప్పకనే చెబుతున్నారు.
మరి ప్రజలకు ఇవన్నీ పట్టింపు ఉంటాయా హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది అని హర్యానాలో ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేయకుండా ఉంటారా అన్నదే చర్చ. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరిస్థితులు ఉంటాయి. అంతే కాదు రాజకీయ పరిస్థితులు పరిణామాలు పర్యవసానాలు అన్నీ చూసిన మీదటనే ప్రజలు ఒక నిర్ణయం తీసుకుంటారు. హర్యానాలో బీజేపీకి పదేళ్ళు చాన్స్ ఇచ్చిన ప్రజలు మార్పు కోసం చూస్తున్నారు అనుకుంటే కాంగ్రెస్ కి కచ్చితంగా అవకాశం వస్తుంది. అపుడు బీజేపీ హిమాచల్ ప్రదేశ్ ని బూచిగా చూపించినా కుదరదు.
పైగా హిమాచల్ ప్రదేశ్ లో ఆర్థిక పరిస్థితి వేరు. హర్యానా వేరు. ఈ మాటలు కాంగ్రెస్ చెప్పుకోలేదా బీజేపీ పెట్టిన భయాలను ఆ పార్టీ చూపిస్తున్న బూచిని కూడా పక్కకు నెట్టలేదా అని కూడా అంటున్నారు. మొత్తానికి బీజేపీ నేతల మాటలు చూస్తే కాంగ్రెస్ కి అక్కడ హవా బాగానే ఉందనిపిస్తోంది అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి బీజేపీ ముందు ముందు ఏ విధంగా ప్రచారంలో పదనిసలు పలికిస్తుందో.