జమ్మూనే నమ్ముకున్న బీజేపీ ?
బీజేపీ గడచిన కొన్ని ఎన్నికల నుంచి జమ్మూలో బలం పెంచుకుంటోంది. కాశ్మీర్ లో అయితే ముస్లిం డామినేషన్ ఉంటుంది.
బీజేపీ ఓటు బ్యాంక్ అంతా జమ్మూలోనే ఉంది. హిందూత్వ నినాదాలు కానీ బీజేపీ 370 ఆర్టికల్ రద్దు ప్రభావం కానీ జమ్మూలోనే ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ మెజారిటీ హిందువులు ఉంటారు. వారంతా బీజేపీ పట్ల సానుకూలంగా ఉంటారు. బీజేపీ గడచిన కొన్ని ఎన్నికల నుంచి జమ్మూలో బలం పెంచుకుంటోంది. కాశ్మీర్ లో అయితే ముస్లిం డామినేషన్ ఉంటుంది.
సహజంగా అక్కడ చూస్తే నేషనల్ కాన్ఫరెన్స్ కే జనాలు ఓట్లు వేస్తారు. ఈసారి ఎన్నికల్లో చూస్తే జమ్మూలో 43 అసెంబ్లీ సీట్లకు కాశ్మీర్ లో 47 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే మొత్తం 90 సీట్లకు అన్న మాట. ఈ తొంబై సీట్లకూ మెజారిటీ దక్కాలీ అంటే మ్యాజిక్ ఫిగర్ 46 రావాలీ. బీజేపీకి జమ్మూలో అత్యధిక సీట్లు దక్కినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటుందా అన్నదే చర్చగా ఉంది.
ఒకవేళ జమ్మూలో బీజేపీ పాతిక నుంచి ముప్పయి సీట్లు తెచ్చుకున్నా మరో 16 సీట్లు కొరత పడతాయి. మరి అవి ఎలా సాధిస్తుంది అన్నది చూడాల్సి ఉంది. ఇక కాశ్మీర్ లో చూస్తే పండిట్లను ఇతర వర్గాల వారిని ముస్లిమేతరులను ఆకట్టుకోవడానికి బీజేపీ ఒకే జెండా ఒకే దేశం అని చెబుతోంది. అయితే అత్యధిక ఓట్లు అన్నీ పోలరైజ్ అయి నేషనల్ కాన్ఫరెన్స్ దానితో పొత్తు ఉన్న కాంగ్రెస్ కూటమికే పడతాయి. దాంతో బీజేపీ కాశ్మీర్ లో కొన్ని పాకెట్లలోనే పోటీ చేస్తూ మిగిలిన చోట్ల తమకు రేపటి రోజున అనుకూలంగా మారుతారు అనుకున్న వర్గాలకు ఇండిపెండెంట్లకు మద్దతు ఇచ్చేలా ప్లాన్ చేసుక్నుంటోనిద్.
మరో వైపు చూస్తే వినాయక చవితి ముహూర్తంగా బీజేపీ మ్యానిఫేస్టోని హోం మంత్రి అమిత్ షా కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విడుదల చేశారు. ఆయన నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్, పీడీఎఫ్ లను విమర్శించారు. ఆ మూడు పార్టీలూ అధికారంలోకి వస్తే ఉగ్రవాదులకు ఆశ్రయంగా కాశ్మీర్ మారుతుంది అని ఆయన హెచ్చరించారు.
కాశ్మీర్ కి వేరే జెండా ఉండాలని ఆ పార్టీలు కోరుకుంటున్నాయని ఆయన దుయ్యబెట్టారు. అదే బీజేపీ అయితే ఒకే దేశంగా ఉంచుతూ కాశ్మీర్ ని అంతర్భాగం చేస్తూ అక్కడ అభివృద్ధికి పాటు పడుతుందని చెప్పుకొచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే కాశ్మీర్ కి రాష్ట్ర హోదా ఇస్తుందని ఆయన చెప్పారు.
ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఒక వేళ బీజేపీ గెలవకపోతే కేంద్ర పాలిత ప్రాంతంగానే జమ్మూ కాశ్మీర్ లను ఉంచుతుందా అన్న చర్చ నడుస్తోంది. అంతే కాదు ఆ విధంగా చేసినట్లు అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీజేపీ కేంద్ర ఆధిపత్యం అలాగే ఉంటుంది. మొత్తానికి చూస్తే బీజేపీ బహుముఖమైన ప్రణాళికలతో కాశ్మీర్ ఎన్నికలను ఎదుర్కోబోతోంది.