ఇదేం ట్విస్ట్... ఢిల్లీకి చేరిన అభ్యర్ధుల జాబితా

పోటీచేసే విషయంలో ఆశక్తి ఉన్న నేతలంతా దరఖాస్తులు చేసుకోవాలని అధిష్టానం చెప్పింది

Update: 2024-03-06 05:02 GMT

రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే బీజేపీ అభ్యర్థుల జాబితా ఢిల్లీకి చేరుకున్నది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ డిసైడ్ అయ్యిందని సమాచారం. పోటీచేసే విషయంలో ఆశక్తి ఉన్న నేతలంతా దరఖాస్తులు చేసుకోవాలని అధిష్టానం చెప్పింది. ఎంపీ, అసెంబ్లీ స్ధానాల్లో పోటీ చేయటానికి 2500 మంది నేతలు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలన, వడపోత పేరుతో ఏపీ ఇన్చార్జి శివప్రకాష్ ఆధ్వర్యంలో మూడురోజులు సమీక్షలు జరిగాయి. ఫైనల్ గా పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు 575 దరఖాస్తులను ఎంపికచేశారు.

పార్లమెంటు నియోజకవర్గాల కేమో సగటున మూడు దరఖాస్తులను, అసెంబ్లీ సమావేశాల్లో పోటీకి మిగిలిన 500 దరఖాస్తులు పరిశీలన నిమిత్తం ఢిల్లీకి చేరుకున్నాయి. ఈ విషయమై ఈనెల 9వ తేదీన ఢిల్లీలో కీలక సమావేశం జరగబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. అవకాశముంటే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో శివప్రకాష్, పురందేశ్వరి, ఏపీకి చెందిన కీలక నేతలు సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందని తెలిసింది. ఇక్కడే ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఉంది. అదేమిటంటే శివప్రకాష్, పురందేశ్వరి తో పాటు మరికొందరు సీనియర్ నేతలు మేనిఫెస్టో ప్రకటనపైన కూడా సమావేశం అవబోతున్నారు.

అంటే 25 పార్లమెంటు, 175 అసెంబ్లీల్లో పోటీకి దరఖాస్తుల వడబోత, మ్యానిఫెస్టో తయారీ లాంటి కీలకమైన డెవలప్మెంట్లు బీజేపీలో జరిగిపోతున్నాయి. మరోవైపు టీడీపీతో పొత్తు విషయంలో అడుగుకూడా ముందుకు పడలేదు. టీడీపీతో పొత్తుపెట్టుకునే విషయంలో చంద్రబాబునాయుడుతో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫిబ్రవరి 6వ తేదీన సమావేశమయ్యారు. వాళ్ళిద్దరి మధ్యా జరిగిన చర్చల అవుట్ పుట్ ఏమిటో ఎవరికీ తెలీదు. అయితే అప్పటినుండి ఇప్పటివరకు చర్చల తాలూకు డెవలప్మెంట్లు కూడా ఏమీలేదు.

ఇక్కడే ఇటు టీడీపీలో అటు బీజేపీలో కూడా అయోమయం పెరిగిపోతోంది. పొత్తు విషయంలో బీజేపీ అగ్రనేతలు ఏదో ఒక క్లారిటి ఇచ్చేస్తే చాలామందిలో అయోమయం తొలగిపోతుంది. అప్పుడు తొందరగా అభ్యర్ధుల ఎంపిక, ప్రకటన జరిగి ఎన్నికలకు రెడీ అయిపోతారు. ఈ విషయాలు అమిత్ షా కు తెలీవని అనుకునేందుకు లేదు. అయినా ఎందుకు తాత్సారం చేస్తున్నారో అర్ధంకావటంలేదు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News