ఆ రెండు నగరాలూ అచ్చిరాలేదా? వైసీపీ నేతల లాజిక్!
ఆ రెండు స్థానాలే విజయవాడ, గుంటూరు పార్లమెంటు స్థానాలు.
ఒక చోట ఒకసారి ఓడిపోవచ్చు.. రెండు సార్లు ఓడిపోవచ్చు.. కానీ, పదే పదే ఒకే స్థానంలో ఓడిపోతే.. అచ్చిరాలేదనే అనుకోవాలి. ఇప్పుడు వైసీపీకి కూడా ఇలా అచ్చిరాని నియోజకవర్గాలు ఉన్నాయి. పార్టీ పెట్టిన తర్వాత.. వైసీపీ మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో గత 2019లో 22 చోట్ల విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక, మూడు చోట్ల మాత్రమే టీడీపీ గెలిచింది. అయితే.. ప్రస్తుతం వైసీపీ 4 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అయితే.. ఈ విషయం కన్నా.. ఓ రెండు స్థానాల్లో ఓటమి మాత్రం పార్టీని కలవరపరుస్తోంది. ఆ రెండు స్థానాలే విజయవాడ, గుంటూరు పార్లమెంటు స్థానాలు.
2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రెండు చోట్లా వైసీపీ విజయం దక్కించుకోలేక పోయింది. చిత్రం ఏంటంటే.. ఈ రెండు నియోజకవర్గాల మధ్యలోనే జగన్ నివాసం కూడా ఉంటున్నారు. అయినప్పటికీ.. ఈ రెండు స్థానాల్లో వైసీపీ డింకీలు కొడుతూనే ఉంది. దీంతో వైసీపీకి ఈ రెండు స్థానాలూ కలిసిరాలేదా? అనే సందేహాలు తెరమీదికి వచ్చాయి. 2014లో తొలిసారి వైసీసీ పూర్తిస్థాయిలో పార్లమెంటుస్థానాలకు పోటీ చేసింది. ఈ క్రమంలో విజయవాడ, గుంటూరులో ఉన్న ఎంపీ సీట్లను దక్కించుకోలేక పోయింది. విజయవాడ విషయానికి వస్తే.. వ్యాపార వేత్త కోనేరు రాజేంద్రప్రసాద్ పోటీ చేశారు.
భారీగానే డబ్బులు ఖర్చు చేశారు. కానీ, ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత కాలంలో ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. 2019లో బరిలో దిగిన వ్యాపార వేత్త పీవీపీది కూడా ఇదే పరిస్థితి. ఇక, గుంటూరు స్థానంలోనూ.. వైసీపీ విజయం దక్కించుకోలే క పోయింది. 2014, 2019లో టీడీపీ తరఫున గల్లా జయదేవ్ విజయం దక్కించుకున్నారు. తాజా ఎన్నికలలో పెమ్మసాని విజయం సాధించారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాలు కూడా వైసీపీకి కలిసి రాలేదన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. అంతేకాదు.. ఈ ప్రభావం భవిష్యత్తుపైనా పడనుందని అంటున్నారు. ఎందుకంటే.. కలిసి రాని నియోజకవర్గాల్లో పోటీకి నాయకులు కూడా జంకుతారు కదా!! సో.. ఇలా వైసీపీ ఈ రెండు చోట్లా పట్టు దక్కించుకోలేక పోయింది.