బీజేపీలో ఏం జరుగుతోంది ?

ఇపుడీ విషయమే పార్టీలోని చాలామంది సీనియర్లకు అర్ధంకావటంలేదు. పార్టీలో చేరుతామని వస్తున్న నేతలను చివరి నిముషంలో వెనక్కుపోయేట్లు చేస్తున్నారు

Update: 2023-09-14 05:59 GMT

ఇపుడీ విషయమే పార్టీలోని చాలామంది సీనియర్లకు అర్ధంకావటంలేదు. పార్టీలో చేరుతామని వస్తున్న నేతలను చివరి నిముషంలో వెనక్కుపోయేట్లు చేస్తున్నారు. పార్టీలో చేర్చుకునేందుకు ముందు ఎందుకు అంగీకరించాలి చివరినిముషంలో ఎందుకు వెనక్కు పంపాలన్నది అర్ధంకావటంలేదు. చేరుతామని వస్తున్న నేతలను చివరినిముషంలో అడ్డుకుని వెనక్కు పంపేస్తున్నది ఎవరో కూడా అర్ధంకావటంలేదు. తాజాగా క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ వ్యవహారమే ఇందుకు నిదర్శనం.

పార్టీలో చేరాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. అందుకు పై స్ధాయిలో గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. బహుశా కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆమోదం కూడా దొరికే ఉంటుంది. మంగళవారం నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో కిషన్ సమక్షంలోనే పార్టీ కండువా కప్పుకోవటానికి ముహూర్తం పెట్టుకున్నారు. పేపర్లలో పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇచ్చుకున్నారు. భారీ సంఖ్యలో మద్దతుదారులతో పార్టీ ఆఫీసుకు వచ్చిన చికోటికి షాక్ తగిలింది.

ఎందుకంటే చికోటి పార్టీ ఆఫీసుకు వచ్చినపుడు కిషన్ కాదు కదా సీనియర్లలో ఎవరూ కనబడలేదు. దాంతో చికోటి పార్టీలో చేరకుండానే వెనక్కువెళ్ళిపోయారు. నిజంగా ఇది చికోటిని అవమానించటమనే అనుకోవాలి. చికోటి క్యాసినో కింగ్ అన్న విషయం ముందే అందరకీ తెలుసు. ఈయనపై కేసులు నమోదుచేసి ఈడీ దర్యాప్తుచేస్తోంది. థాయ్ ల్యాండ్ లో క్యాసినో లో ఉన్నపుడు అరెస్టయ్యాడు కూడా. నేపధ్యం ఇంత వివాదాస్పదంగా ఉన్నపుడు పార్టీలో చేరుతానని అడిగినపుడే కాదని చెప్పేసుంటే సరిపోయేది.

ఆమధ్య కృష్ణయాదవ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. పార్టీలో చేరటానికి యాదవ్ అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరినిముషంలో పార్టీలో చేర్చుకోవటం కుదరదని చెప్పారు. దాంతో యాదవ్ అవమానంగా ఫీలయ్యారు. అసలే పార్టీలో చేరే పెద్దనేతలు ఎవరు కనబడటంలేదు. ఒకపుడు పార్టీలో చేరుతామని అనుకున్న చాలామంది నేతలు తర్వాత వెనక్కుతగ్గారు. కర్నాటకలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించటంతో చాలామంది నేతలు బీజేపీలో కాకుండా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఈ నేపధ్యంలో చేరుతామని వస్తున్న వాళ్ళని కూడా ఏదో కారణంతో అవమానించి వెనక్కు పంపేయటం ఎందుకో అర్ధంకావటంలేదు.

Tags:    

Similar News