ఎస్సీ ఓట్లను బీజేపీ ఖాతాలోకి మళ్లించేందుకు భారీ వ్యూహం!

కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బీజేపీ ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా కొన్ని కీలక సీట్లపై ఫోకస్ పెట్టింది.

Update: 2023-12-16 12:27 GMT

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ సారి ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు అనుకున్న మేర పర్ఫార్మ్ చేయలేకపోయాయన్న వాదనలను పక్కన పెడితే.. 70కి పైగా సీట్లు వస్తాయనుకున్న కాంగ్రెస్ 64తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ గెలుపు కోసం శాయశక్తుల కృషి చేసినా.. చివరికి రెండో స్థానంలోకి వెళ్లలేక తప్పలేదు. ఇక మరో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ గతంలో కంటే మంచి పర్ఫర్మెన్స్ చేసిందనే చెప్పవచ్చు. 2018లో ఒక సీటుతో ఉన్న ఈ పార్టీ భారీగా ఓట్లను తన ఖాతాలో వేసుకొని 8 సీట్లను గెలుచుకుంది. ఇంకా చాలా నియోజకవర్గా్ల్లో రెండో స్థానంలో నిలిచింది.

మందకృష్ణను బరిలో దించేలా ప్లాన్..

కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బీజేపీ ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా కొన్ని కీలక సీట్లపై ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ కు మోదీ అనుకూలంగా స్పందించారు. దీంతో మందకృష్ణ మాదిగ బీజేపీతో కలిసిపోయారు. మాదిన జన సమీకరణ చేసి భారీ సభ నిర్వహించగా మోడీ అందులో హామీల వర్షం కురిపించారు. ఆ తర్వాత బీజేపీతోనే వెళ్లాలని తమ సామాజికవర్గం.. పార్టీ నాయకులను ఆయన కోరారు. ఈ ఓట్లు కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్లినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది.

పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి మందక‌ృష్ణ!

పెద్దపల్లి లోక్ సభ స్థానం ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయ్యింది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి మందకృష్ణను పోటీ చేయించి సీటు దక్కించుకోవాలని వ్యూహాలకు పదును పెడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మాదిగల ఓట్లు తమకు అనుకూలంగా మారితే మరిన్ని సీట్లు సాధించవచ్చని భావిస్తున్నది. ఇదే స్థానం నుంచి గతంలో మాజీ ఎంపీ వివేక్ పోటీ చేశారు. కానీ ఆయన రెండు పర్యాయాలు ఓటమి చవిచూశారు. ఈ సారి తన కుమారుడిని కాంగ్రెస్ నుంచి బరిలో దించాలని పట్టుదలతో ఉన్నాడు. ఈయనకే కాకుండా మరో నేత టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తున్నది. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత ఎంపీ వెంకటేశ్ నేతకాని బరిలో ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీఎస్పీ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అతను పోటీ నుంచి తప్పుకుంటే ఇతరులకు అవకాశం దక్కవచ్చు.

సీట్ల కేటాయింపులో సామాజిక న్యాయం..

తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో ఈసారి బీజేపీ పోటీ చేసే అవకాశం ఉంది. అందుకు సంబంధించి ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా బరిలో నిలిచే అభ్యర్థుల లిస్టును రెడీ చేసినట్లు తెలుస్తున్నది. గతంలో కేవలం నాలుగు సీట్లకే పరిమితమైన బీజేపీ.. ఈసారి అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను వెనక్కి నెట్టి ఎక్కువ స్థానాల్లో పాగా వేయాలని రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన ఓట్లు.. సీట్లతో కొత్త కార్యాచరణతో ముందుకు పోతున్నది. అందులో భాగంగా సీట్ల ఖరారులో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది.

Tags:    

Similar News