ఏంది సామీ.. తెలంగాణను కమ్మేస్తున్న కమలనాథులు
ఈ ఒక్క రోజు (సోమవారం)ను చూస్తే.. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ అగ్రనాయకత్వం సుడిగాలి పర్యటనను జరుపుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు జరుగుతున్న ప్రచారం తుది దశకు చేరుకోవటం తెలిసిందే. ఈ రోజు (సోమవారం) రేపు మాత్రమే ప్రచారానికి సమయం మిగిలి ఉంది. దీంతో.. ఎవరికి వారు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు తెలంగాణ అధికార పక్షం బీఆర్ఎస్ తన మొత్తం శక్తియుక్తుల్ని ప్రదర్శిస్తుంటే.. కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. బీజేపీ నేతలు మొదట్లో మామూలుగా ఉన్నా.. ఇప్పుడు మాత్రం తెలంగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో బీజేపీ అభ్యర్థుల్లో కొత్త ఉత్సాహాన్ని పొంగేలా చేస్తున్నారు.
ఈ ఒక్క రోజు (సోమవారం)ను చూస్తే.. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ అగ్రనాయకత్వం సుడిగాలి పర్యటనను జరుపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలు కొని.. పలువురు అగ్ర నాయకులు తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ మేం ప్రస్తావిస్తున్నది బీజేపీ అగ్రనాయకత్వం మాత్రమే. ఒక మోస్తరు నేతలు మరెందరో భారీగా ప్రచారం చేస్తున్న పరిస్థితి. వీరిషెడ్యూల్ చూస్తే.. ఏంది సామీ.. తెలంగాణను కమ్మేస్తున్నారుగా? అన్న భావన కలగటం ఖాయం.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
ఉదయం 10.25గంలకు తిరుపతి నుండి బయలుదేరి 11.30హకీంపేట్ కు
మధ్యాహ్నం 12.35 గంటలకు మహబూబాబాద్
మధ్యాహ్నం 12.45 - 1.25వరకు 40నిమిషాల పాటు బహిరంగ సభ
మధ్యాహ్నం 1.35గంటలకు మహబూబాబాద్ నుండి కరీంనగర్
మధ్యాహ్నం 2.45 - 3.25వరకు కరీంనగర్ సభ
సాయంత్రం 4.35 గంటలకు హైదరాబాద్ కు
సాయంత్రం 5గంటలకు నుండి 6 గంటల వరకు హైదరాబాద్ లో రోడ్డు షో
సాయంత్రం 5 గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు 2 కిలోమీటర్ల మేర రోడ్ షో
అనంతరం అమీర్ పేటలోని గురుద్వారాలో ప్రత్యేక పూజలు (గురుపౌర్ణమి సందర్భంగా)
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా_
మధ్యామ్నం 12.30గంటలకు జగిత్యాల లో రోడ్ షో
మధ్యాహ్నం 2గంటలకు బోధన్ లో సభ
సాయంత్రం 3గంటలకు బాన్సువాడ
సాయంత్రం 4గంటలకు జుక్కల్ సభ
కేంద్ర హెం మంత్రి అమిత్ షా
ఉదయం 11 గంటలకు హుజురాబాద్
మధ్యామ్నం 1గంటలకు పెద్దపల్లి
మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాల నియోజకంలో సభ
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ
ఉదయం 11గంటలకు దేవరకొండ
మధ్యాహ్నం 1గంటలకు మంథని
మధ్యాహ్నం 2గంటలకు పరకాల
సాయంత్రం 3.30గంటలకు వరంగల్ బీజేపీ ఆఫీసు నుంచి రోడ్ షో
సాయంత్రం 5గంటలకు దుబ్బాకలో సభ
కేంద్రమంత్రి పీయూష్ గోయల్
సాయంత్రం 6 గంటలకు హన్మకొండలో మేధావులతో భేటీ
కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్
ఉదయం 11 గంటలకు భద్రాచలం
మధ్యామ్నం 12.30గంటలకు సిద్దిపేట సభ
కేంద్రమంత్రి మురళీధరన్
మధ్యాహ్నం 12గంటలకు అలంపూర్ లో పార్టీ కార్యకర్తలతో సమావేశం
మధ్యాహ్నం 3గంటలకు అలంపూర్ లో ఇంటి ఇంటికి ప్రచారం