ఒడిశాలో కమల వికాసం.. నవీన్ రికార్డుకు బ్రేక్
సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడవుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు విజయాన్ని సొంతం చేసుకునే దిశగా దూసుకెళుతోంది సైకిల్. మొత్తం 175 స్థానాల్లో చంద్రసేన (టీడీపీ, జనసేన, బీజేపీ)కు ఏకంగా 161 స్థానాల్లో విజయం సాధించగా.. అధికార వైసీపీకి కేవలం 14 స్థానాల్లో మాత్రమే అధిక్యత కొనసాగుతోంది. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఎంతోకాలంగా ఒడిశా మీద కన్నేసిన బీజేపీకి ఎట్టకేలకు ఆ రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకునే దిశగా ఫలితాలు వెలువడుతున్నాయి.
తాజాగా వెలువడుతున్న ఫలితాల్ని చూస్తే.. మరోసారి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేతికి అధికార పగ్గాలు అందేట్లుగా కనిపించని పరిస్థితి. ఎందుకంటే.. ఈ రాష్ట్రంలో బీజేపీ దూసుకెళుతోంది. జాతీయ స్థాయిలో కాస్తంత నెమ్మదించిన కమలనాథులు ఒడిశాలో మాత్రం అందుకు భిన్నంగా తమ బలాన్ని చాటుతున్నారు. తాజా ఎన్నికల్లో నవీస్ పట్నాయక్ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే.. అది అరో దఫా అవుతుంది.
దేశంలో ఇన్నిసార్లు సీఎంగా అధికారాన్ని సొంతం చేసుకున్న వారు ఎవరు లేరు. ఈ రికార్డు నవీన్ పేరు మీద నమోదు అవుతుందని భావించారు. కానీ.. .ఒడిశా ప్రజలు మాత్రం బీజేపీకి ఓటేశారు. ఇప్పటివరకు వెల్లడైన గణాంకాల ప్రకారం చూస్తే.. మొత్తం 147 స్థానాలకు పోలింగ్ జరగ్గా.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికార బీజేపీ కేవలం 48సీట్లలోనే అధిక్యతను ప్రదర్శిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ 13 చోట్ల అధిక్యంలో ఉండగా.. ఇతరులు ఐదు స్థానాల్లో గెలుపు దిశగా పయనిస్తున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. బీజేపీ మాత్రం ఈ రాష్ట్రంలో దూసుకెళుతోంది.
ఇప్పటివరకు కమలం పార్టీకి 81 స్థానాల్లో అధిక్యతను ప్రదర్శిస్తోంది. ఒడిశాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 74 స్థానాలు అవసరం. దానికి కాస్త ఎక్కువ స్థానాలు బీజేపీ సొంతమయ్యాయి. 2000 తర్వాత నుంచి గడిచిన రెండు దశాబ్దాలుగా నవీన్ సారథ్యంలోనే ఒడిశా ఉంది. దాదాపు 24 ఏళ్లకు ఒడిశాలో బీజేడీయేతర పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాలి. నిజానికి ప్రధాని నరేంద్ర మోడీకి.. నవీన్ పట్నాయక్ కు మంచి స్నేహం ఉంది. కాకుంటే.. ఈసారి ఎన్నికల్లో మాత్రం ఇరువురి మధ్య దూరం పెరిగింది. అదే సమయంలో ప్రధాని మోడీతన ఎన్నికల ప్రచారంలో నవీన్ ఆరోగ్యం గురించి చేసిన వ్యాఖ్యలకు.. నవీన్ సైతం అంతే ఘాటుగా రియాక్టు అయ్యారు. మొత్తంగా నవీన్ చేతుల నుంచి ఒడిశా పగ్గాలు జారినట్లుగా చెప్పక తప్పదు.