వీర్యదాతకు బిడ్డపై హక్కు లేదు.. తేల్చేసిన బాంబే హైకోర్టు

తన కవల పిల్లలు సరోగసీ ద్వారా పుట్టారని.. వారు తన భర్త.. సోదరితో ఉన్నట్లుగా ఒక మహిళ పిటిషన్ దాఖలు చేసింది.

Update: 2024-08-14 05:15 GMT

సున్నితమైన అంశానికి సంబంధించి కీలకమైన తీర్పును వెలువరించింది బాంబే హైకోర్టు. సంతానం లేని వారికి వీర్యదాత ద్వారా అండం ఇచ్చే మహిళలకు పుట్టే బిడ్డకు ఉండే చట్టబద్ధమైన హక్కు మీద క్లారిటీ ఇచ్చేసింది. వీరిద్దరికి పుట్టిన బిడ్డకు చట్టపరమైన హక్కు ఉండదని తేల్చేసిన న్యాయస్థానం.. పిల్లలకు వారు జీవసంబంధ తల్లిదండ్రులుగా చెప్పటం కుదరదని పేర్కొంది. ఇంతకూ ఈ తీర్పునకు కారణమైన కేసును చూస్తే..

తన కవల పిల్లలు సరోగసీ ద్వారా పుట్టారని.. వారు తన భర్త.. సోదరితో ఉన్నట్లుగా ఒక మహిళ పిటిషన్ దాఖలు చేసింది. తన సోదరే అండాన్ని దానం చేసిందని.. కానీ తన భర్త మాత్రం అండం దానం చేసిన మరదలికే పిల్లలపై చట్టపరమైన హక్కు ఉందని వాదిస్తున్నారని పేర్కొంది.

ఈ వాదనను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు పిటిషనర్ సోదరిని జీవ సంబంధ తల్లిగా చెప్పే హక్కు ఉండదని తేల్చేసింది. పిటిషనర్ సోదరి అండదానంతోనే సరోగసీ ద్వారా 2019లో కవలలు పుట్టారు. ఆ సమయంలో పిటిషనర్ సోదరి కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. దాంతో ఆమె కుమార్తె.. భర్త చనిపోయారు. ఇదే సమయంలో వైవాహిక బంధంలో విభేదాల కారణంగా భార్యకు చెప్పకుండా భర్త వేరే ఇంటికి వెళ్లిపోయాడు.

ఈ టైంలోనే భర్త.. పిల్లల మరణంతో మానసికంగా డిస్ట్రబ్ అయి ఉన్న మరదలు తమతో ఉంటుందని.. పిల్లల బాధ్యత ఆమె చూసుకుంటుందని చెప్పటంతో భార్య అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోలీసులకు కంప్లైంట్ చేసింది. స్థానిక కోర్టును ఆశ్రయించింది. కింది కోర్టు ఆమె వాదనను తోసిపుచ్చగా.. హైకోర్టును ఆశ్రయించగా.. తాజా తీర్పు వెల్లడైంది.

Tags:    

Similar News