విశాఖ సీట్లలో బొత్స రిపేర్లు ...!?
విశాఖ ఎంపీ క్యాండిడేట్ గా సీనియర్ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేయబోతున్నారు
విశాఖ ఎంపీ క్యాండిడేట్ గా సీనియర్ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ చేయబోతున్నారు. ఆమె పోటీ చేయడం అంటే గెలుపు గుర్రం ఎక్కాల్సిందే ని మంత్రి పట్టుదలగా ఉన్నారు. అందుకోసం ఆయన విశాఖ వైసీపీ మీద ఫుల్ ఫోకస్ పెట్టారని అంటున్నారు.
విశాఖ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో కనీసంగా మెజారిటీ సీట్లలో వైసీపీకి గెలుపు అవకాశాలు ఉంటే కచ్చితంగా ఎంపీ సీటు ఆ పార్టీ పరం అవుతుంది. అయితే విశాఖల ఎంపీ పరిధిలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ వైసీపీ కచ్చితంగా గెలుస్తుంది అన్న మాట వినిపించడం లేదు.
ఒక్క ఎస్ కోటలోనే ఆ గ్యారంటీ ఉంది. విశాఖ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ లతో పాటు భీమునిపట్నం గాజువాకలలో సైతం వైసీపీకి ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. దాంతో బొత్స ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఇంచార్జిల పనితీరుని మధింపు చేస్తున్నారు అని అంటున్నారు.
గాజువాకలో కొత్త ఇంచార్జిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన ఉరుకూటి రామచంద్రరావుకు అవకాశం ఇచ్చారు. దాంతో గాజువాక వైసీపీలో వర్గ పోరు తారస్థాయికి చేరుకుంది. అక్కడ రెండు వర్గాలు బొత్స ఝాన్సీ వద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నాయి. తమకు మద్దతుగా ఉండమని కోరుతున్నాయి. దాంతో మధ్యే మార్గం వైపు బొత్స చూస్తున్నారు అని అంటున్నారు.
ఇక్కడ ఇంచార్జి మార్పు అనివార్యం అని అధినాయకత్వానికి సూచిస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా విశాఖ తూర్పులో కూడా మార్పు తప్పదని అంటున్నారు. ఎంవీవీకి ఇక్కడ పట్టు లేదని ఆయనకు సీటు ఇస్తే బీసీ వర్గాలు వ్యతిరేకించే ప్రమాదం ఉందని నివేదికలు వస్తున్నాయి. మరి దీని మీద వైసీపీ హై కమాండ్ ఏమి చేస్తుందో చూడాలి.
ఇప్పటిదాక విశాఖ సౌత్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కి తిరుగులేదని అనుకున్నారు. కానీ ఆయన్ని తప్పిస్తేనే పార్టీకి ఎంతో కొంత బలం అని అంటున్నారు. దాంతో అక్కడ కూడా వైసీపీ హై కమాండ్ కొత్త సర్వేలు చేయిస్తోంది అని అంటున్నారు.
ఇలా కీలక నియోజకవర్గాలలో ఇంచార్జిలను మార్చే చాన్స్ ఉందని అంటున్నారు. అలాగైతేనే విశాఖ ఎంపీకి కూడా విజయావకాశాలు ఉంటాయని అంటున్నారు. మరి వైసీపీ హై కమాండ్ విశాఖలో రిపేర్లను చేపడితే మాత్రం ఇపుడున్న పేర్లు కనిపించకపోవచ్చు. దాంతో చాలా మంది ఆశలు అడియాశలు అవడం ఖాయమని అంటున్నారు. ఈ విషయంలో బొత్స చక్రం తిప్పుతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.