వైరల్... మగాళ్ల ఎమోషన్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ స్కాన్ చేయండి!

అవును... క్రియేటివ్ గా ఆలోచించాలే కానీ.. ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఏ విషయమైనా ఇట్టే వైరల్ అయిపోతుంది.

Update: 2024-07-20 08:30 GMT

కాదేదీ క్రియేటివిటీకి అనర్హం అని అంటారు. విభిన్నంగా ఆలోచిస్తే.. ఈరోజుల్లో ఏ విషయమైనా ప్రపంచం మొత్తానికి తెలియడానికి, అటు నుంచి రియాక్షన్ రావడానికి పెద్ద సమయం పట్టదు! దీనికి కావాల్సిందళ్లా కొత్తగా ఆలోచించడం.. సరికొత్తగా ప్రజెంట్ చేయడం. తాజాగా ఢిల్లీలో ఓ వ్యక్తి ఇలానే ఆలోచించాడు. టీషర్ట్ పై క్యూఅర్ కోడ్ వేసి ఆసక్తికరమైన క్యాప్షన్ పెట్టాడు.

అవును... క్రియేటివ్ గా ఆలోచించాలే కానీ.. ఈ టెక్నాలజీ ప్రపంచంలో ఏ విషయమైనా ఇట్టే వైరల్ అయిపోతుంది. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీలోని రోహిత్ సలుజా అనే వ్యక్తి ఇలానే ఆలోచించాడు. ఇందులో భాగంగా... టీషర్టుపై క్యూఅర్ కోడ్ స్కానర్ ప్రింట్ చేశాడు. దీని ద్వారా నిధుల సేకరణకు సరికొత్త పంథాను ఎంచుకున్నాడు. పూజా సన్వాల్ అనే నెటిజన్ ఈ విషయాన్ని 'ఎక్స్' లో పోస్ట్ చేశాడు.

వివరాళ్లోకి వెళ్తే... ఢిల్లీలోని కన్నాట్ ప్రాంతంలో రోహిత్ సలుజా అనే వ్యక్తి తన టీషర్టుపై క్యూఆర్ కోడ్ స్కానర్ ప్రింట్ చేశాడు. దానిపై "మగాళ్ల భావోద్వేగాలు స్కాన్ చేసి తెలుసుకోండి" అని రాసి ఉంది. ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. సరే.. ఆ భావోద్వేగాలు ఏమిటో తెలుసుకుందామని స్కాన్ చేస్తే ఓ రిక్వస్ట్ తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... "మా క్షురకుడు సోనూ ఫోన్ పోగొట్టుకున్నాడు.. పైగా అతడి ఆర్థిక పరిస్థితి బాగాలేదు.. అందువల్ల అతడు మరో మొబైల్ కొనుక్కోలేక బాధపడుతున్నాడు.. అతడికి సహాయం చేయాలని ఇలా నిధులు సేకరిస్తున్నాను.. ఆ ఫోనులో కుమార్ సాను నుంచి హనీ సింగ్ వరకూ అందరి పాటలూ ఉండేవి.. కొత్త ఫోన్ కొన్నాక ఆ పాటలన్నీ డౌన్ లోడ్ చేసి బహుమతిగా ఇస్తాను" అని ఉంది.

ఇదే సమయంలో... అతడిని స్థానికులంతా.. "గాజియాబద్ కా అలీం హకీం (సినిమా స్టార్స్ హెయిర్ స్టైలిస్ట్)" అని పిలుస్తారు" అని రోహిత్ వివరించారు. ఈ నేపథ్యంలో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో... ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సంస్థ ఈ వినూత్న ఆలోచనపై స్పందించింది. రోహిత్ ప్రయత్నానికి సహకరిస్తూ సోనూకు కొత్త ఫోను బహుమతిగా ఇచ్చింది.


Tags:    

Similar News