అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు... బ్రెజిల్ లో దారుణ పరిస్థితులు!

ఈ భూమిపై అత్యంత తేమ ప్రాంతంగా పేరున్న అమెజాన్ బేసిన్ లో భీకర కార్చిచ్చు రగులుకొంది.

Update: 2024-10-01 11:40 GMT

ఈ భూమిపై అత్యంత తేమ ప్రాంతంగా పేరున్న అమెజాన్ బేసిన్ లో భీకర కార్చిచ్చు రగులుకొంది. గత 14 ఏళ్లలో ఏనాడూ ఈ స్థాయి కార్చిచ్చులు రాలేదని ఈయూ కోపర్నికస్ అబ్జర్వేటరీ పేర్కొంది. ఇది కరువుతో ఇబ్బందిపడుతున్న బ్రెజిల్ కు మూలిగే నక్కమీద తాటికాయ పడిన చందంగా మారిందని అంటున్నారు.

అవును.. అమెజాన్ అడవుల్లో భీకర కార్చిచ్చు రగులుకొంది. దీని దెబ్బకు బ్రెజిల్ లో 80 శాతం ప్రాంతాన్ని పొగ కమ్మేసిందని చెబుతున్నారు. దీంతో... ఓ వైపు తీవ్ర కరువుతో ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు ఈ కార్చిచ్చులు పంటపోలాలను, పచ్చదనాన్ని దహనం చేస్తున్నాయని చెబుతున్నారు.

ఈ పొగ వల్ల ఇప్పటికే అర్జెంటీనా, బొలివియా, బ్రెజిల్, ఈక్వెడార్, కొలంబియా, పెరూ, పరాగ్వేలలో లక్షల హెక్టార్ల అటవీ భూమి, పొలాలు దహనమైపోయాయని అంటున్నారు. ఈ పొగను పీలిస్తే రోజుకు ఐదు సిగరెట్లు తాగినంత ఎఫెక్ట్ ఆరోగ్యంపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అందరూ మాస్కులు ధరించాలని హెచ్చరిస్తున్నారు.

బ్రసిలియాలోని ఆసుపత్రులకు చాలా మంది రోజులు శ్వాస సంబంధ ఇబ్బందులతో వస్తున్నట్లు ఘణాంకాలు చెబుతున్నాయంటే.. పరిస్థితి అర్ధం చేసుకొవచ్చని అంటున్నారు. మరోపక్క స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ గణాంకాల ప్రకారం.. సావో పౌలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచిన పరిస్థితి.

దీంతో... ఇక్కడ సుమారు 40 శాతం ప్రజల ఆరోగ్యాన్ని ఈ పొగ ప్రభావితం చేస్తుందని అంటునారు. వాస్తవానికి బ్రసిలియాలో సుమారు ఐదున్నర నెలలుగా చుక్క వర్షం పడలేదని చెబుతున్నారు. ఇదే సమాంలో... ప్రజలంతా మాస్కులు ధరించాల్సిన పరిస్థితి నెలకొందని అంటున్నారు.

ఇటీవల కాలంలో అమెజాన్ లో ఏర్పడిన కార్చిచ్చుల్లో ప్రజల హస్తం ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు. సాగుకు యోగ్యంగా అటవీ భూమిని మార్చేందుకే నిప్పు పెడుతున్నట్లు గుర్తించారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో బ్రెజిల్ పొరుగునున్న బొలీవియాను నేషనల్ డిజాస్టర్ గా ప్రకటించారు!

కాగా... గతవారం నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఉపగ్రహ చిత్రాల్లో 80 శాతం బ్రెజిల్ పై పొగచూరుకొని ఉన్నట్లు తేలింది.

Tags:    

Similar News