బ్రిటన్ లో కుక్కల బెడద... ప్రధాని కీలక నిర్ణయం!

అవును... బ్రిటన్ లో కుక్కల బెడద తీవ్ర ఎక్కువగానే ఉంది. దేశప్రధానే స్వయంగా స్పందించాల్సిన పరిస్థితి ఎదురైందంటే తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.

Update: 2023-09-16 17:03 GMT

గతకొంతకాలంగా హైదరాబాద్ లో చాలా చోట్ల వీదుల్లో ఆడుకుంటున్న చిన్న పిల్లలపై వీదికుక్కలు చేసిన దాడుల సంగతి తెలిసిందే. ఆ ఇష్యూ వైరల్ గా అయ్యింది. జీ.హెచ్.ఎం.సి. అధికారులపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు బ్రిటన్ లో కూడా కుక్కల సమస్య పెరిగిపోయిందని ఏకంగా ఆదేశ ప్రధానమంత్రే స్పందించాల్సిన పరిస్థితి ఎదురైంది.

అవును... బ్రిటన్ లో కుక్కల బెడద తీవ్ర ఎక్కువగానే ఉంది. దేశప్రధానే స్వయంగా స్పందించాల్సిన పరిస్థితి ఎదురైందంటే తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి బ్రిటన్ లో కొద్ది రోజులుగా కుక్క కాట్లు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ సమస్యపై ఆ దేశ ప్రధాని రిషి సునక్ స్పందించారు. ఇందులో భాగంగా ఒక జాతి కుక్కల పెంపకంపై నిషేధం విధించారు.

ఈ సందర్భంగా బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ ఒక వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా... అమెరికన్‌ ఎక్స్‌ ఎల్‌ బులీ డాగ్స్‌ మనుషులకు ప్రమాదకరంగా పరిణమించాయని, ముఖ్యంగా ఇవి చిన్నారులపై దాడులు చేస్తున్నాయని అన్నారు. అనంతరం ఈ తరహా కుక్కలు దాడులకు పాల్పడటానికి సంబంధించిన కొన్ని వీడియోలను ఆయన షేర్‌ చేశారు.

శిక్షణ పొందిన శునకాలతో సమస్య లేదని, అయితే ఎక్స్‌ ఎల్‌ బులీ డాగ్స్‌ ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో గుర్తించలేమని తెలిపిన సునాక్... బ్రిటన్‌ లో పెరుగుతున్న కుక్కల బెడద నివారణకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నదని తెలియజేశారు. ఇదే సమయంలో ఇటీవల జరిగిన దాడులకు కారణమైన కుక్కల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నామని ప్రకటించారు.

ఈ మేరకు ట్విట్టర్ లో ఒక వీడియోనీ షేర్ చేసిన సునాక్... అమెరికన్‌ ఎక్స్‌ ఎల్‌ బులీ జాతికి చెందిన కుక్కల పెంపకంపై నిషేధం విధించారు. ఎవరైనా నిషేధిత కుక్క జాతిని కలిగి ఉన్నారని తేలితే వారికి అపరిమిత జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.

Tags:    

Similar News