"తెలంగాణలో వైసీపీ" ఎందుకు ఆగిందో చెప్పిన షర్మిల భర్త!

దీంతో... వరుసపెట్టి తనపై స్పందించినవారందరికీ తలంటే పనిలో షర్మిల బిజీగా ఉన్నారు!

Update: 2024-10-29 04:24 GMT

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న అత్యంత హాట్ టాపిక్స్ లో వైఎస్సార్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివాద వ్యవహారం టాప్ ప్లేస్ లో ఉందని చెప్పినా అతిశయోక్తి కాదేమో. ఈ విషయంలో వైసీపీ నేతలు, వైఎస్సార్ బంధువులూ వరుసగా మైకుల ముందుకు వచ్చి షర్మిలపై విమర్శల వర్షాలు కురిపిస్తున్నారు.

దీంతో... వరుసపెట్టి తనపై స్పందించినవారందరికీ తలంటే పనిలో షర్మిల బిజీగా ఉన్నారు! ప్రధానంగా తల్లిపై కేసు పెట్టిన కొడుకుగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు అని షర్మిల ఫైర్ అవుతున్నారు. ఆ పరిస్థితి తీసుకొచ్చిన చెల్లిగా షర్మిల చరిత్రలో నిలిచిపోతారంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సమయంలో బ్రదర్ అనిల్ ఎంటరయ్యారు.

అవును... వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ - ఆయన సోదరి షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తుల వివాద వ్యవహారాలపై బ్రదర్ అనిల్ స్పందించారు. ఈ సందర్భంగా తన భార్య కుటుంబానికి సంబంధించిన ఆస్తుల గురించి తనకు పూర్తిగా తెలియదు అని అంటూ.. షర్మిలకు అయితే ఆస్తులు పంచలేదని మాత్రం తెలిపారు.

ఈ సమయంలో అసలు జగన్ కు షర్మిలకు మధ్య రగడ ప్రారంభమవ్వడానికి గల కారణాల్లో ఒకటైన "తెలంగాణలో వైసీపీ" అనే విషయాన్ని ప్రస్థావించారు. ఇందులో భాగంగా... 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ సూపర్ విక్టరీ సాధించిన తర్వాత ప్రశాంత్ కిశోర్ వచ్చి షర్మిలను తెలంగాణలో పార్టీ పెట్టాలని సూచించినట్లు చెప్పారని అన్నారు.

అయితే.. ఈ విషయం తన అన్నను అడగమని షర్మిల చెప్పారని.. దీంతొ పీకే వెళ్లి జగన్ వద్ద ఈ విషయాన్ని ప్రస్థావించారని అన్నారు. ఈ విషయంపై స్పందించిన జగన్... "నో నో నో, అక్కడ కేసీఆర్ ఉన్నాడక్కడ, మాకు ఇబ్బంది అవుతాది, అసెట్స్ అన్నీ అక్కడే ఉన్నాయి అని అన్నారంట.. అప్పటి నుంచీ డిఫరెన్సెస్ మొదలయ్యాయి" అని అనిల్ అన్నారు.

తాజాగా ఓ ప్రముఖ తెలుగు యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రదర్ అనిల్ ఈ విషయాలను వెల్లడించారు. దీంతో... జగన్ – కేసీఆర్ బంధానికి సంబంధించి ఆసక్తికర అంశం తెరపైకి వచ్చిందని.. ఇదే సమయంలో.. తెలంగాణలో పార్టీని విస్తరించడం కంటే ఆస్తులను కాపాడుకునే విషయం పైనే జగన్ పూర్తి దృష్టి పెట్టినట్లున్నారనే చర్చ మొదలైంది!

Tags:    

Similar News