బీఆర్ఎస్ ఇక చేతులు ఎత్తేసినట్టేనా ?
ఇంతకీ విషయం ఏమిటంటే ఈనెలాఖరులో ఎంఎల్ఏ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎదురైనా అనుభవంతో బీఆర్ఎస్ బ్యాక్ స్టెప్ వేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇంతకీ విషయం ఏమిటంటే ఈనెలాఖరులో ఎంఎల్ఏ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో పోటీచేయకూడదని కేసీయార్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బలంలేని చోట పోటీపెట్టి ఓడిపోవటం కేసీయార్ కు ఇష్టంలేదట. రేపటి ఎన్నికల్లో ఓడిపోతే దాని ప్రభావం తొందరలోనే జరగబోయే పార్లమెంటు ఎన్నికలపైన పడుతుందని అనుకుంటున్నారట.
ఒక ఎంఎల్సీ స్ధానాన్ని గెలుచుకోవాలంటే 40 మంది ఎంఎల్ఏల ఓట్లుకావాలి. కాంగ్రెస్ కున్న 64 ఓట్లతో ఒక సీటును ఈజీగా గెలుచుకుంటుంది. ఇంకా 24 మంది ఎంఎల్ఏల ఓట్లు అదనంగా ఉంటాయి. అయితే రెండోసీటును గెలిపించుకోవాలంటే కచ్చితంగా ఇతర పార్టీల నుండి ఎంఎల్ఏలను లాక్కోవాల్సిందే. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఒక స్ధానాన్ని గెలుచుకోవాలంటే ఒక్క ఎంఎల్ఏ ఓటు తక్కువవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కున్న ఎంఎల్ఏలు 39 మంది మాత్రమే. ఈ ఒక్క ఎంఎల్ఏ ఓటు కోసం బీఆర్ఎస్ కూడా ఇతర పార్టీల మీద ఆధారపడాల్సిందే.
దాంతో రెండుపార్టీలు అదనపు ఓట్లకోసం ఎలాంటి వ్యూహాలను అనుసరించబోతున్నాయనే ఆసక్తి పెరిగిపోతోంది. అయితే కేంద్ర ఎన్నికల కమీషన్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ నెత్తిన పాలు పోసినట్లయ్యింది. ఎలాగంటే రెండుస్ధానాల ఎన్నకలను కలిపికాకుండా దేనికదే విడిగా నిర్వహించాలని. అంటే కమీషన్ నిర్ణయం కారణంగా రెండుస్ధానాలను కాంగ్రెస్ చాలా ఈజీగా గెలిచేస్తుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ కు ప్రయత్నానికి కూడా అవకాశంలేకుండా పోయింది.
ఈ నేపధ్యంలోనే అన్నీ కోణాల్లో పరిస్ధితులను సమీక్షించిన కేసీయార్ అసలు పోటీకి దూరంగా ఉంటే సరిపోతుందని అనుకున్నారట. బలంలేకపోయినా సింగరేణి ఎన్నికల్లో పోటీచేసి పరువుపోగొట్టుకున్నారు. అధికారం పోగానే బీఆర్ఎస్ వైభవం అంతా పోతోంది. అందుకనే సింగరేణి ఎన్నికల్లో ఘోరఓటమి. కాబట్టి ఎంఎల్సీ ఎన్నికల నుండి కూడా బ్యాక్ స్టెప్ వేయటమే ఉత్తమమని కేసీయార్ డిసైడ్ అయ్యారట. ఎవరైనా ఎంఎల్ఏలు పార్టీ అభ్యర్ధులకు ఓట్లేయకుండా జారిపోతే అప్పుడు తీరని అవమానం ఎదుర్కోవాల్సుంటుందన్నది అసలు భయమట.