అయ్యో పాపం కామ్రేడ్స్
కానీ కేసీఆర్.. వామపక్ష పార్టీలకు షాక్ ఇచ్చారనే చెప్పాలి. సీట్ల సర్దుబాటుపై వామపక్ష పార్టీలు, కేసీఆర్కు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయని సమాచారం.
బీఆర్ఎస్తో వామపక్షాల పొత్తు లేదనేది స్పష్టమైంది. కేసీఆర్ ఏకంగా 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం అందుకు కారణం. మరి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుందామనుకున్న సీపీఐ, సీపీఎం ఆశలు గల్లంతయ్యాయనే చెప్పాలి. మరి ఇప్పుడు కామ్రేడ్ల కింకర్తవ్యం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. భవిష్యత్ కార్యచరణపై సీపీఐ, సీపీఎం ఉమ్మడిగా సమావేశమై చర్చించనున్నాయి.
నిజానికి మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు సీపీఐ, సీపీఎం మద్దతునిచ్చాయి. అక్కడ బీఆర్ఎస్ విజయం కోసం శ్రమించాయి. అప్పటి నుంచి కేసీఆర్, వామపక్ష నాయకుల మధ్య స్నేహం మొదలైంది. వచ్చే ఎన్నికల్లోనూ ఈ పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందని అనుకున్నారు.
కానీ కేసీఆర్.. వామపక్ష పార్టీలకు షాక్ ఇచ్చారనే చెప్పాలి. సీట్ల సర్దుబాటుపై వామపక్ష పార్టీలు, కేసీఆర్కు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయని సమాచారం. అందుకే ఏ పార్టీతో ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగా ఎన్నికలకు కేసీఆర్ సిద్ధమయ్యారు.
చర్చల్లో భాగంగా సీపీఎం, సీపీఐలకు ఒక్కో ఎమ్మెల్యే స్థానం, రెండేసి చొప్పున ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని బీఆర్ఎస్ ప్రతిపాదించినట్లు తెలిసింది. కానీ చెరి 3 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని వామపక్ష పార్టీలు పట్టుబట్టాయి. లేదంటే కనీసం రెండేసి చొప్పున ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలన్నా ఇవ్వాలని కోరాయి.
కానీ ఒక్కో అసెంబ్లీ స్థానం, రెండేసి ఎమ్మెల్సీ సీట్లు మాత్రమే ఇస్తామని కేసీఆర్ తేల్చిచెప్పడంతో చర్చలు విఫలమయ్యాయని తెలిసింది. సీపీఎంకు భ్రదాచలం, సీపీఐకి మునుగోడు ఇస్తామని కేసీఆర్ చెప్పగా.. ఆ పార్టీలు ఒప్పుకోలేవని తెలిసింది.