రూ.340 కోట్ల రుణం... బుట్టా రేణుక ఆస్తుల వేలానికి ప్రకటన!

ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక & కో... వ్యాపార అవసరాల నిమిత్తం కొన్నేళ్ల కిందట ఎల్.ఐ.సీ. హౌసింగ్ ఫైనాన్స్ నుంచి రూ. 340 కోట్ల రుణాన్ని తీసుకున్నారంట.

Update: 2024-04-05 04:33 GMT

ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులకు సంబంధించిన ఏ విషయమైనా తీవ్ర సంచలనంగా మారుతుందనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఆస్తుల వేలం అనే వార్త తెరపైకి వచ్చిందని తెలుస్తుంది. దీంతో.. ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది.

అవును... కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక భాగస్వామిగా ఉన్న బుట్టా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు మరికొన్ని సంస్థల ఆస్తులను మే నెల 6వ తేదీన ఈ-వేలం వేయనున్నట్లు హైదరాబాద్ లోని ఎల్.ఐ.సీ. హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ప్రకటించిందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

ప్రధాన పత్రికల్లో వస్తోన్న కథనాల ప్రకరం... ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక & కో... వ్యాపార అవసరాల నిమిత్తం కొన్నేళ్ల కిందట ఎల్.ఐ.సీ. హౌసింగ్ ఫైనాన్స్ నుంచి రూ. 340 కోట్ల రుణాన్ని తీసుకున్నారంట. అయితే.. కోవిడ్ సమయంలో పలు వ్యాపారాలు దెబ్బతినడంతో... కొన్నింటిని మూసేయాల్సి వచ్చిందని అంటున్నారు.

దీంతో... అప్పు బకాయిలు పేరుకుపోవడం వల్ల తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయాలని ఎల్.ఐ.సీ. హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నిర్ణయించినట్లు చెబుతున్నారు. బకాయిల చెల్లింపు అంశంపై నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ లో ఉన్న ఈ నేపథ్యంలో వేలం వేయాలని ప్రకటించడం ఆసక్తిగా మారింది!

వాస్తవానికి ఈ అంశం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో ఉండగా.. వేలం ప్రకటన విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధం అని చెబుతున్నారు. దీంతో... ఈ వేలం ప్రక్రియను నిలిపివేసేలా బుట్టా రేణుక & కో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని తెలుస్తోంది.

Tags:    

Similar News