తాగి వాహనం నడుపుతున్నారా?... కంటికి కనిపించని కెమెరా గురించి తెలుసా?

మద్యం తాగి వాహనం నడిపేవారిని పట్టుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఓ కెమెరా తయారైంది. ఈ కెమెరాలను ఆక్యూసెన్సస్ అనే సంస్థ తయారు చేసింది.

Update: 2024-12-17 14:30 GMT

మద్యం తాగి వాహనం నడపడం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు నిత్యం వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి. వీటివల్ల ఎంతో మంది తల్లితండ్రులు పిల్లలను కోల్పోతుండటం, భవిష్యత్తును కోల్పోతుండటం జరుగుతుండగా.. మరికొంతమంది పిల్లలు, తల్లితండ్రులను కోల్పోయి అనాథలుగా మిగులుతున్నారు.

ఈ విషయంలో పోలీసులు ఎన్ని కఠినమైన ఆంక్షలు విధించినా, ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నా.. మద్యం తాగి వాహనం నడపకూడదు అనే ఇంగితాన్ని మనిషి మరిచిపోతున్నాడు.. ఫలితంగా తన జీవితాన్ను తాను నాశనం చేసుకుంటూ.. ఎదుటివారి జీవితాలతోనూ ఆటలాడుతున్నాడు. అలాంటివారి కోసం కంటికి కనిపించని కెమెరా తెరపైకి వచ్చింది. ఇది తాగి వాహనం నడిపే వారికి చెక్ పెట్టనుంది.

అవును... మద్యం తాగి వాహనం నడుపుతూ.. దగ్గర్లో ఎక్కడా పోలీస్ చెకింగ్ లేదులే అని ధైర్యంగా వెళ్లిపోయేవారికి తాజాగా బ్యాడ్ న్యూస్ తెరపైకి వచ్చింది! రోడ్లపై పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులతో సంబంధం లేకుండా.. వారిని కదలికలను బట్టే పసిగట్టే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో కూడిన కెమెరా వచ్చేసింది. ఇది ఎలా పనిచేస్తుందనేది ఇప్పుడు చూద్దాం...!

మద్యం తాగి వాహనం నడిపేవారిని పట్టుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఓ కెమెరా తయారైంది. ఈ కెమెరాలను ఆక్యూసెన్సస్ అనే సంస్థ తయారు చేసింది. ప్రస్తుతం ఈ కెమెరాలను బ్రిటన్ పోలీసులు ప్రయోగాత్మకంగా వాడి చూస్తున్నారు. వీటి పనితీరు చాలా బాగుందని అంటున్నారని తెలుస్తోంది!

అంతా అనుకూలంగా జరిగితే త్వరలో ఇవి పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయబడతాయని అంటున్నారు. గతంలో వాహనాలు నడుపుతూ ఫోన్ వాడటం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం వంటి పనులకు పాల్పడేవారిని పట్టుకోవడానికి ఈ సంస్థ కెమెరాలనే వాడారని అంటున్నారు. అయితే.. తాజా ఏఐ కెమెరాలు డ్రైవర్లకు కనిపించకుండా ఉంటాయని చెబుతున్నారు.

కాగా... ఈ విషయాలపై స్పందించిన బ్రిటన్ పోలీసులు.. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని ప్రమాదానికి ముందే గూర్తించగలిగితే అనేక ప్రాణాలు కాపాడొచ్చని.. ఆ ఉద్దేశ్యంతోనే ఆక్యూసెన్సస్ ఈ తరహా కెమెరాలను తయారు చేసిందని.. ప్రమాదాలను తగ్గించడానికి చేపడుతున్న చర్యల్లో ఇదొక భాగం అని అంటున్నారు.

Tags:    

Similar News