మొండి కత్తి మాకూ దొరకదా... ప్రభాకర్‌ రెడ్డి మీద దాడిపై కేసీఆర్ నిప్పులు!

ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేసీఆర్... అన్ని నియోజకవర్గాలకంటే ఎక్కువ అభివృద్ధి ఈ నియోజకవర్గంలోనే జరిగిందని అన్నారు.

Update: 2023-10-30 11:42 GMT

తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ బాస్ కేసీఆర్ దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. వరుస సభలతో తనదైన శైలిలో ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటిస్తున్నారు కేసీఆర్. ఈ రోజు జాబితాలో సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ ఖేడ్‌, కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌, బాన్సువాడ నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు ఉన్నాయి! ఈ సందర్భంగా తాజాగా బాన్సువాడలో జరిగిన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఎన్నికల ప్రచారంలో అధికార బీఆరెస్స్ దూకుడు పెంచుతుంది. ఓ వైపు అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తుంటే.. మరోవైపు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్రమంలో బాన్సువాడలో జరిగిన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్‌ రెడ్డి మీద జరిగిన దాడిపై తెలంగాణ సీఎం సీరియస్ గా స్పందించారు. అది ప్రభాకర్‌ రెడ్డి మీద జరిగిన దాడి కాదని.. కేసీఆర్‌ మీద జరిగిన దాడని అన్నారు.

ఈ సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేసీఆర్... అన్ని నియోజకవర్గాలకంటే ఎక్కువ అభివృద్ధి ఈ నియోజకవర్గంలోనే జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా... పోచారం సారథ్యంలో బాన్సువాడ బంగారువాడలా మారిందని ప్రశంసించారు. ఇదే క్రమంలో... బాన్సువాడలో ఇప్పటివరకూ 11 వేల డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు కట్టించామని కేసీఆర్ తెలిపారు.

ఇదే సమయంలో... అతికష్టం మీద తెలంగాణను సాధించుకున్నామని పేర్కొన్న సీఎం కేసీఆర్‌... ఉప్పెనలా ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చిందని.. 15 ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. మెదడు కరిగించి అభివృద్ధి చేసుకున్నామని.. పెద్ద పెద్ద రాష్ట్రాల్లో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందని.. పదేళ్లు నీతి, నిబద్ధతో పనిచేస్తేనే అది సాధ్యమైందని కేసీఆర్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ప్రభాకర్‌ రెడ్డి మీద జరిగిన దాడిపై కేసీఆర్ సీరియస్ గా స్పందించారు. ఇందులో భాగంగా... ప్రభాకర్‌ రెడ్డి మీద జరిగిన దాడి కాదని.. కేసీఆర్‌ మీద జరిగిన దాడి అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎదుర్కోలేని చేతగాని దద్దమ్మ పార్టీలు, చేతగాని వెధవలూ ఈ రోజు దాడిచేశారని చెప్పిన కేసీఆర్... మొండి కత్తి మాకూ దొరకదా అని ప్రశ్నించారు.

ఇక, జుక్కల్లో ఉన్నప్పుడే తనకు ఈ వార్త అందిందని, వెళ్లిపోదాం అని అనుకున్నా.. ఆయనకు ప్రాణహాని లేదని మంత్రులు చెప్పడంతో ఆగిపోయినట్లు కేసీఆర్ వెల్లడించారు. ఇవే పనులు తాముచేయాలనుకుంటే దుమ్ము రేగిపోతుందని కేసీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజా సేవ చేస్తే దాడులు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News