వైసీపీ నేతల భార్య, పిల్లలపై పోస్టులు.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

ఇందులో భాగంగా.. సోషల్ మీడియాలో మహిళలు, అమ్మాయిలపై అనుచిత పోస్టులు పెట్టినా.. వారి జోలికి వచ్చినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు చంద్రబాబు.

Update: 2024-11-09 16:27 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం మిగిలిన అన్ని విషయాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వాళ్ల గురించిన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఇదే చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేవలం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే లక్ష్యంగా పోలీసులు కేసులు పెడుతున్నారని.. కందిపప్పు కిలో ప్యాకెట్ లో 780 గ్రాములే ఉందని నిలదీసిన కార్యకర్తపైనా కేసులు పేడుతున్నారని.. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారలపై టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ లో ఇది భాగం అని వైసీపీ నేతలు విమర్శిస్తున్న వేళ చంద్రబాబు స్పందించారు.

అవును... ఏపీలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నవారిపై పోలీసులు కేసులు పెడుతున్నారు.. అయితే... చంద్రబాబు, పవన్, అనిత ఇంట్లో ఆడవాళ్లే ఆడవాళ్లా.. వైసీపీ నేతల ఇళ్లల్లో మహిళలపై పోస్టులు పెట్టిన, పెడుతున్న వారి పరిస్థితి ఏమిటి అని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. ఈ సమయంలో బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా.. సోషల్ మీడియాలో మహిళలు, అమ్మాయిలపై అనుచిత పోస్టులు పెట్టినా.. వారి జోలికి వచ్చినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు చంద్రబాబు. ఈ సందర్భంగా... తీవ్రవాదులను, ముఠా నాయకులను ఎదుర్కొన్న చరిత్ర తమకు ఉందన్న చంద్రబాబు.. బీకేర్ ఫుల్ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు!

ఇక ప్రస్తుత సమాజంలో నేరస్థులు... రాజకీయ ముసుగులు వేసుకున్నారని చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా.. సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారు ఏ పార్టీకి చెందినవారైనా వదిలేది లేదని.. వైసీపీ నేతల భార్యా పిల్లలపై పోస్టులు పెట్టినా, కామెంట్స్ చేసినా ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.

దీంతో... సోషల్ మీడియాలో మహిళలపైనా, అమ్మాయిల పైనా అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారు.. తప్పుడు కామెంట్లు చేసేవారి విషయంలో చంద్రబాబుకు తన పర బేధం లేదని.. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా తాట తీయడమే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Tags:    

Similar News