అమరావతికి గుడ్ న్యూస్ చెప్పిన బాబు ఢిల్లీ టూర్!

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు.

Update: 2024-07-05 07:11 GMT

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు. ఈ క్రమంలో ప్రధానమంత్రిని కలిసిన ఆయన... మూడో సారి ప్రధానిగా ఎన్నికవ్వడంపై మోడీకి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ఈ క్రమంలోనే అమరావతికి సంబంధించిన కసరత్తులు చేసినట్లు తెలుస్తుంది.

అవును... ఢిల్లీలో చంద్రబాబు సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా... మోడీ, అమిత్ షా లతోపాటు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మొదలైనవారిని కలిశారు. ఈ సందర్భంగా అమరావతికి సంబంధించి కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా ప్రధానంగా ప్రధాన్యతా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు అమరావతికి తిరిగి ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని చంద్రబాబు.. ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు విజ్ఞప్తికి.. మోడీ సానుకూలంగా స్పందించారని.. సత్వర చర్యలు తిసుకుంటారని అంటున్నారు.

ఇలా చంద్రబాబు హస్తిన పర్యటన ముగిసిన 24 గంటల్లోపే కేంద్రం చర్యలకు ఉపక్రమించిందని అంటున్నారు. ఇందులో భాగంగా... అమరావతిలో ముందుగా భూములు కేటాయించిన 45 కేంద్ర కార్యాలయాలు అమారావతికి తిరిగి రావడం ప్రారంభించాయని అంటున్నారు. వాస్తవానికి ఇవి 2019కి ముందే రావాల్సి ఉండగా.. వైసీపీ ప్రభుత్వ ఫలితంగా ఆగినట్లు చెబుతున్నారు! ఈ మేరకు సీఆర్డీయే ఏర్పాట్లు చేసుందని అంటున్నారు.

Read more!

మోడీతో భేటీ అనంతరం ఎక్స్ లో స్పందించిన చంద్రబాబు... ఏపీ అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన అంశాల పరిష్కారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో నిర్మాణాత్మక సమావేశం జరిగిందని.. ఆయన నాయకత్వంలో రాష్ట్రం మళ్లీ బలమైన పవర్ హౌస్ గా అవతరిస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు.


Tags:    

Similar News

eac