బాబు పవర్ ఫుల్.. అర్ధమవుతోందా ?
అందుకే తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఒక మాటను ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇంటర్వ్యూలో చెప్పారు. బాబు కనుక తలచుకుంటే దేశానికి కొత్త ప్రధాని వస్తారు అని.
టీడీపీ అధినేత చంద్రబాబుని అపర చాణక్యుడు అంటారు. ఆయన రాజకీయ వ్యూహాలు కొన్ని సార్లు గతి తప్పవచ్చు కానీ ఆయన బలం మాత్రం ఎపుడూ తగ్గలేదు అన్నది కూడా విశ్లేషణగా ఉంది. బాబు దేశ రాజకీయాల్లో చూస్తే చాలా సీనియర్ మోస్ట్ నేత. అంతే కాదు ఈ రోజుకీ డైనమిక్ లా ఉండే పొలిటిషియన్ అని చెప్పాలి.
లేటెస్ట్ గా ఇండియా టూడే చేసిన ఒక సర్వేలో దేశంలో అత్యంత శక్తిమంతులు పదిమందిని తీసుకుంటే ఆ జాబితాలో టాప్ ఫైవ్ లో చంద్రబాబు ఉన్నారు. మొదటి ప్లేస్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఉంటే రెండవ ప్లేస్ లో ఆరెస్సెస్ చీఫ్ భగవత్ మూడవ ప్లేస్ లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, నాలుగవ ప్లేస్ లో రాహుల్ గాంధీ ఉంటే బాబుది అచ్చంగా అయిదవ స్థానం.
పైన నలుగురూ జాతీయ రాజకీయాల్లో ఇపుడు కీలకంగా ఉన్నారు. మరి విభజన ఏపీకి సీఎం గా ఉంటూ కేవలం ప్రాంతీయ రాజకీయాలకే పరిమితం అయిన చంద్రబాబు అయిదవ ప్లేస్ లోకి ఎలా వచ్చారు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఆలోచిస్తే దానికి జవాబు కూడా సులువే అని చెప్పాలి. ఎందుకంటే బాబు ఈ రోజు ఏపీకి సీఎం గా ఉన్నా జాతీయ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారు.
ఆయన రాజకీయ తులాభారంలో తులసీదళంగా ఉన్నారు. ఆయన మొగ్గు ఎటు వైపు ఉంటే వారే రేపటి ప్రధాని అన్నంతగా బాబు బలం ఉంది. బాబుకు ఉన్న ఎంపీల బలం 16 మంది కావచ్చు. కానీ 543 మంది సభ్యులు క్లిగిన లోక్ సభలో అది ఊహకు అందనంత బలం. ఎందుకంటే ఎన్డీయేకు అధికారం మూడవసారి దక్కాలీ అంటే ఈ పదహారు ఎంపీల బలం అత్యంత కీలకం.
అందుకే బాబు అత్యంత శక్తివంతమైనవారు అని అంతా అనుకున్నారు. ఆయనకే ఓటేశారు. ఈ ఒక్క నంబర్ గేమ్ లోనే కాదు బాబు వ్యూహాలు ఆయన చాకచక్యం ఆయన అనుభవం ఆయన డైనమిక్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా క్రెడిట్ గా తీసుకునే ఆయనకు ఈ టాప్ ర్యాంక్ ఇచ్చారనుకోవాలి.
బాబు ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితమే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఆయన తలచుకోవాలే కానీ ప్రభుత్వాలు అలా ఏర్పాటూ చేయగలరూ ఉన్న వాటిని లేకుండానూ చేయగలరు. అందుకే తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఒక మాటను ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఇంటర్వ్యూలో చెప్పారు. బాబు కనుక తలచుకుంటే దేశానికి కొత్త ప్రధాని వస్తారు అని.
అంటే అంతటి పవర్ ఫుల్ చంద్రబాబు అని అర్ధం అవడం లేదా. ఇక చంద్రబాబు తాను ఒక్కరే కాదు, తన పార్టీ ఒక్క దానినే కాదు, ఆయనకు ఉన్న మూడు దశాబ్దాలకు పైగా ఉన్న జాతీయ రాజకీయాల అనుభవాలు పరిచయాలతో ఎంతో మందిని కొత్త మిత్రులను సంపాదించగలరు, ఆయన అనుకుంటే ఇండియా కూటమి ఎన్డీయే కూటమే కాదు కొత్త కూటమిని కూడా క్రియేట్ చేయగలరు. 1996లో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కాకుండా యునైటెడ్ ఫ్రంట్ అని ఒక కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసిన బాబు గురించి అందరికీ తెలిసిందే కదా.
అందువల్ల ఆనాటి పరిచయాలు బాబుకు ఇప్పటికీ ఉన్నాయి. దేశ రాజకీయాల్లో బాబుకు తెలియని నేత లేరు. ఆయన కలవని నాయకుడు కూడా లేరు. ఏపీ పునర్నిర్మాణం అన్న లక్ష్యంతో బాబు ఉన్నారు. అందుకే ఆయన జాతీయ రాజకీయాల వైపు తొంగి చూడటం లేదు.
అయినా బాబు గురించి ఆయన సామర్థ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టే ఆయనకు టాప్ ర్యాంక్ ఇచ్చారు. దేశంలో ఈ రోజుకు చూస్తే రాజకీయంగా బాబు అత్యంత శక్తివంతమైన నాయకుడు అనడంలో సందేహమే లేదు. అంతే కాదు బాబు తన మొత్తం రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడని విశేష అవకాశాలను అధికారాని 2024 తరువాత నుంచి చూస్తున్నారు. ఆయన కనుసన్నలలో కేంద్ర ప్రభుత్వం ఉంది.
ఏపీలో ఆయనకు అద్భుతమైన మెజారిటీ ఉంది. కనుచూపు మేరలో కదిలించే ప్రత్యర్ధి అయితే లేనే లేరు. ఆయనకు ఏపీలో కానీ దేశంలో కానీ తనదైన వ్యూహాలకు చెక్ చెప్పే సరిసాటి నాయకుడు కూడా లేరు. అందుకే బాబు పవర్ ఫుల్. ఇదే ఊపుతో రానున్న కాలంలోనూ ఆయనే పవర్ ఫుల్ అన్నా ఆశ్చర్యం లేదేమో. ఆ విషయంలో ఎవరికైనా ఎనీ డౌట్స్.