మోడీ భారీ సాయం....ట్విస్ట్ ఇచ్చిన బాబు !

ఇంకేమిటి కేంద్రం తక్షణ సాయమే ఇన్ని వేల కోట్లు ఉంటే ఇక పూర్తి సాయంతో భారీగా నిధుల వరద పారిస్తుందని అంతా భావించారు.

Update: 2024-09-06 17:17 GMT

రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వరదలు సంభవించిన నేపథ్యంలో కేంద్రం చొరవ తీసుకుని తక్షణ ఆర్ధిక సాయం కింద 3,300 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినట్లుగా శుక్రవారం ఏకంగా విస్తృతంగా ప్రచారం జరిగింది.

ఇంకేమిటి కేంద్రం తక్షణ సాయమే ఇన్ని వేల కోట్లు ఉంటే ఇక పూర్తి సాయంతో భారీగా నిధుల వరద పారిస్తుందని అంతా భావించారు. అంతే కాదు ఏపీ కష్టాలు తీరిపోతాయని కూడా తలచారు.

నిజానికి ఇంత పెద్ద మొత్తం తక్షణ సాయం అని అంటేనే అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరో వైపు చూస్తే కేంద్రం తరఫున వచ్చిన సీనియర్ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాలలో తన టూర్ ని పూర్తి చేసుకుని తెలంగాణాకు వెళ్లారు.

ఆయన తన తరఫున నివేదికను కేంద్రానికి ఇస్తారు. మరో వైపు కేంద్ర బృందం కూడా నివేదిక ఇస్తుంది. వీటిని ఆసరా చేసుకుని కేంద్రం నిధులు ఇస్తుందని అంతా అనుకున్నారు. కానీ తక్షణ సాయంగా ఇన్ని వేల కోట్లు రావడం అంటే తెలుగు రాష్ట్రాలకు ఇది శుభ సూచకం అని అంతా తలచారు. కానీ దీని మీద ఏపీ సీఎం చంద్రబాబు భారీ ట్విస్ట్ ఇచ్చేశారు.

ఏపీకి 3,300 కోట్ల రూపాయలు భారీ సాయం అన్నది ప్రచారం మాత్రమే అని బాబు అనడం విశేషం. అంటే అది ప్రచారంలో ఉన్నదే తప్ప అధికారికం కాదని బాబు చెప్పినట్లుగా భావించాలి. అదే సమయంలో తమకు కేంద్ర సాయం మీద ఎటువంటి సమాచారం లేదని కూడా బాబు చెప్పడం గమనార్హం.

ఇక వరద నష్టం మీద ప్రాథమిక నివేదికను తయారు చేసి శనివారం ఉదయం కేంద్రానికి పంపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అంటే ఏపీ నుంచి నివేదికలు వెళ్ళిన తరువాతనే కేంద్రం సాయం చేస్తుంది అన్నది బాబు మాటల ద్వారా వెల్లడి అవుతోంది

అంటే తక్షణ సాయం మరి చెబుతున్నాది ఇన్ని వేల కోట్లు తెలుగు రాష్ట్రాలకు ఇస్తున్నది కేవలం ప్రచారమేనా ఇందులో నిజం అన్నది లేదా అన్న చర్చ సాగుతోంది. అసలు ప్రచారం అయితే దానికి ఎవరు ప్రారంభించారు అన్నది కూడా ప్రశ్నగా ముందుకు వస్తోంది.

ఏపీకి తెలంగాణాకు కేంద్రం భారీ సాయం అంటూ ఊదరగొట్టిన ఈ ప్రచారం సంగతి ఏమిటి అన్నదే హాట్ టాపిక్ గా మారింది. సీఎం హోదాలో చంద్రబాబు ఇచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్ చూస్తే కనుక కేంద్రం తప్పనిసరిగా ఏపీ ప్రభుత్వానికి సాయం విషయంలో సమాచారం ఇచ్చి ఉండాల్సిందే.

ఏపీకి ఏ సాయం చేసినా అది కూడా అధికారికంగానే వస్తుంది. ముందు రాష్ట్రానికే తెలుస్తుంది. అలా కాకుండా మీడియాలో వార్తలు రావడం బట్టి చూస్తే ఏమిటి ఇదంతా ఏమి జరుగుతోంది అన్న చర్చ కూడా వస్తోంది ఇంకో వైపు చూస్తే తెలంగాణా భారీగా వరదల్లో నష్టపోయింది. ఆ రాష్ట్రం 5,500 కోట్ల దాకా సాయం అడుగుతోంది. అదే టైం లో చూస్తే ఏపీ కూడా పది వేల కోట్ల దాకా సాయం కోరుతుంది అని ప్రచారం సాగుతోంది. పైగా ఏపీ జాతీయ విపత్తుగా దీనిని చూడాలని కేంద్రాన్ని కోరుతోంది.

కేంద్రంలో టీడీపీ మంత్రులు ఉన్నారు. ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం నడుస్తోంది. ఇలా మిత్రుడిగా ఉన్న టీడీపీ నాయకత్వంలోని ఏపీ ఇబ్బందిలో ఉంటే కేంద్రం భారీగానే సాయం చేస్తుంది అని అంటున్నారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కూటమి కూడా కోటి ఆశలు పెట్టుకుంది. బాబు మాటలు చూస్తే కేంద్రం నుంచి భారీ సాయమే ఏపీకి దక్కుతుంది అని భావిస్తున్నట్లుగా ఉంది.చూడాలి మరి కేంద్రం చేసే సాయం ఏమిటో, దాని అధికారిక వివరాలు ఏమిటో.

Tags:    

Similar News