మంత్రులకు టెన్షన్ పెట్టేలా బాంబు పేల్చిన చంద్రబాబు
చంద్రబాబు అంటే చంద్రబాబే. ఆయన నిన్నా ఇవాళా రాజకీయాలు చేసిన నాయకుడు కాదు, దాదాపు అర్ధ శతాబ్దం కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు
చంద్రబాబు అంటే చంద్రబాబే. ఆయన నిన్నా ఇవాళా రాజకీయాలు చేసిన నాయకుడు కాదు, దాదాపు అర్ధ శతాబ్దం కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నాలుగవ సారి సీఎం అయ్యారు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వారు. ఆయనకు ఒక కార్యకర్త మనసు ఎలా ఉంటుందో ఒక అట్టడుగు నేత ఎలా రియాక్ట్ అవుతారో తెలుసు.
అంతే కాదు ఆయన ఏ టాప్ నాయకుడు ఏమనుకుంటున్నారు, ఏ మంత్రి ఎలా వ్యవహరిస్తున్నారు అన్నీ తెలుసు. బాబు అంటేనే బాప్ కా టెక్నాలజీ. ఆయన బుర్ర పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. విజయవాడ తుఫానుకు నిండా మునిగితే బాబు ఏడున్నర పదుల వయసులో ఏ మాత్రం అలసట లేకుండా పనిచేస్తున్నారు.
అయితే బాబు వేగం అందుకునే వారు ఎందరు అన్నదే కీలకమైన ప్రశ్న. చంద్రబాబు వేగాన్ని ఈ వయసులో ఆయన చూపించే జోరుని అందుకోవడం ఏ నాయకుడి వల్ల కావడం లేదు ఆ విషయంలో దేశంలోనే బాబుకు మరొకరు పోటీ లేరు అని చెప్పవచ్చు.
బాబుకు ఆ కమిట్మెంట్ ఉండబట్టే పెద్ద వయసుని సైతం వెనకాల పెట్టి ముందుకు సాగుతున్నారు. మరి బాబు గారి జోరుని అధికారులు మంత్రులు అందుకుంటున్నారా అన్నదే చర్చ. నిజానికి చూస్తే బాబు పది అడుగులు వేస్తే ఆయనతో కలసి అడుగులు కలిపే వారు ఎవరా అన్న చర్చ ఉంటోంది. బాబు దూకుడుని బ్యాలెన్స్ చేయడం కష్టసాధ్యమైన వ్యవహారమే.
అయితే బాబు చెప్పినట్లుగా మంత్రులు అధికారులు పనిచేస్తే చాలు. సూపర్ సక్సెసే అవుతుంది. కానీ బాబు ఇచ్చిన డైరెక్షన్స్ ని కానీ ఆయన దిశా నిర్దేశం కానీ ఎంత మంది పాటిస్తున్నారు అన్నది మరో చర్చ. దాంతోనే బాబుకు ఎక్కడ లేని కోపం వస్తోంది. తనతో పాటుగా అంతా ఒక టీం గా సాగితేనే ఫలితాలు వస్తాయని బాబు భావిస్తున్నారు.
అయితే ఆయన ఏ మాత్రం తగ్గేది లేదు అని ఒకటికి పదిసార్లు చెబుతున్నారు.అధికారులు ఎవరు పనిచేయకపోయినా క్షమించేది లేదు అని అంటున్నారు. అదే విధంగా మంత్రులకు కూడా బాబు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పనిచేయని మంత్రులు తనకు అక్కర లేదని బాబు బాంబు పేల్చేశారు. మంత్రులు సరిగ్గా పని చేయకపోతే వారిని తీసేస్తాను అని కూడా ఆయన సీరియస్ వార్నింగే ఇచ్చేశారు.
అలాంటి వారితో తనకు అవసరం లేదు అని అన్నరు. జక్కంపూడిలో వరద సహాయ కార్యక్రమాలలో సరిగ్గా పనిచేయని అధికార్ని ఇప్పటికే సస్పెండ్ చేశామని బాబు గుర్తు చేశారు. అందువల్ల మంత్రులు అంతా రంగంలోకి దిగాల్సిందే అని బాబు హెచ్చరించారు. బాబు హెచ్చరికలు ఫలిస్తున్నాయి. చాలా చోట్ల మంత్రులు అంతా వరద నీటిలో పర్యటనలు చేస్తూ జనాలను కలుస్తున్నారు. బాధితులను వారి పరామర్శిస్తూ సహాయ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు.
ఎన్నడూ లేని విధంగా ఉపద్రవం వచ్చిపడింది. దాంతో మొత్తానికి మొత్తం మంత్రివర్గం కదలాలి, అలాగే టాప్ టూ బాటం అధికార గణం కూడా పనిచేయాలి. లేకపోతే ఆశించిన రిజల్ట్ రాదు అన్నదే బాబు ఆలోచన. అందుకే ఆయన అల్టిమేట్ వారింగే ఇచ్చేశారు. దాంతో మంత్రులలో టెన్షన్ పట్టుకుంది.
అసలే పనితీరుని వంద రోజులలో కొలిచి మార్కులు వేస్తామని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో బాబు చెప్పారు. దాంతో ఇపుడు అతి పెద్ద ప్రశ్నాపత్రంగా బెజవాడ వరదలు నిలిచాయి. మరి ఎంత మంది మంత్రులు పనిమంతులుగా నిరూపించుకుంటారు అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు. ఏది ఏమైనా బాబు ఇచ్చిన ఈ కాషన్ తో ప్రభుత్వం మొత్తం అలెర్ట్ అవుతుంది అని అంతా అంటున్నారు.