ఈ సీన్ల కోసమే కదా వెయిటింగ్ !

ఈ అసెంబ్లీ కౌరవ సభ. ఈ సభలో తాను ఉండలేని అని ఒక దండం పెట్టేశారు.

Update: 2024-06-21 09:55 GMT

ఎన్నాళ్ళో వేచిన ఉదయం అన్నట్లుగా కొత్త అసెంబ్లీ కోసం అంతా ఎదురుచూశారు. కొన్ని సన్నివేశాలు తనివి తీరా చూడాలని కలలు కన్నారు. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం 2021 వర్షాకాల సమావేశాలలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు విపక్ష బెంచీల నుంచి లేచి నిలబడి ఒక భారీ శపధం చేశారు.

ఈ అసెంబ్లీ కౌరవ సభ. ఈ సభలో తాను ఉండలేని అని ఒక దండం పెట్టేశారు. మళ్లీ గౌరవ సభగా మార్చి సీఎం గానే అడుగు పెడతాను అని బాబు స్పష్టం చేశారు. అలా జరగని నాడు రాజకీయాలను మానుకుంటాను అని కూడా చెప్పారు. ఇపుడు సీన్ కట్ చేస్తే చంద్రబాబు తాను శపధం చేసినట్లుగానే అసెంబ్లీలోకి దర్జాగా అడుగు పెట్టారు.

ఆయన అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగా అడుగు పెడుతూ గడపకు ప్రణామం చెసారు. ఆయన చాంబర్ లో వేద పండితుల ఆశీస్సులు అందుకున్నాక బాబు సభలోకి వచ్చారు. మొత్తం సభలో సభ్యులు అంతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. నిజం గెలిచింది అంటూ ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శించారు.

ఇక సభా నాయకుడిగా చంద్రబాబు ప్రమాణం చేసినపుడు సభ మొత్తం భావోద్వేగానికి గురి అయింది. ఇదే సభలో బాబు గతంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు అని తలచుకున్నారు. సభలో ఇక మీదట బాబు సీఎం గా తనకు ప్రజలు ఇచ్చిన హోదాతో చక్కగా పాలిస్తారు మంచి శాసనాలు తీసుకుని వస్తారు అని ఎమ్మెల్యేలు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సభలో మరో అపురూప దృశ్యం ఆవిష్కృతం అయింది. అదేంటి నటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి విజయ దరహాసంతో అడుగు పెట్టారు. ఆయన పార్టీ పెట్టి పదేళ్ళు అయిందని అసెంబ్లీ గేటు కూడా తకనివ్వమని వైసీపీ నేతలు హేలన చేశారు. రెండు చోట్ల ఓటమి పాలు అయ్యారని పదే పదే విమర్శలు చేశారు. అలా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ చివరికి 21 అసెంబ్లీ సీట్లను రెండు ఎంపీలను గెలుచుకుని వంద శాతం సక్సెస్ రేటు తో సభలోకి అడుగుపెట్టారు

దాంతో పవన్ ప్రమాణ స్వీకారం సన్నివేశాలు కూడా ఎంతో ఎమోషన్ ని కలిగించాయి. ఆ సన్నివేశాలను జన సైనికులు షేర్ చేస్తూ సామాజిక మాధ్యమాలలో పండుగ చేసుకున్నారు. పవన్ అంటే లయన్ అని వారు అభివర్ణిస్తున్నారు. ఇలా ఇద్దరి విషయంలో పండిన భావేద్వేగాలు ఈ సారి సభలో చిరస్మరణీయమైనవి అని అంటున్నారు.

అదే విధంగా చూస్తే గత అసెంబ్లీలో 151 ఎమ్మెల్యేలతో ఎదురులేని నేతగా నిలిచి తనదైన దర్జాను తో సభను శాసించిన జగన్ కి ఈసారి చేదు అనుభవమే ఎదురైంది. కేవలం 11 మంది ఎమ్మెల్యేలతో ఆయన సభకు రావడం జరిగింది. ఇక ప్రమాణం చేస్తున్నపుడు జగన్ పూర్తిగా ముభావంతోనే ఉన్నారు.

ఆయన ప్రమాణం చేస్తున్నప్పుడు మాత్రం అసెంబ్లీ అంతా పూర్తిగా సైలెంట్ అయింది. అయితే జగన్ తన ప్రమాణం సైతం అన్యమనస్కంగా చేసారా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే వైఎస్ జగన్ మోహన అని ఆగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అని పూర్తి చేశారు. ఇలాంటి రోజు వస్తుందని అసలు ఊహించలేదని వైసీపీ శ్రేణులు నిరాశ నింపుకోగా జగన్ ప్రమాణం సైతం భావోద్వేగాలను నింపింది.

Tags:    

Similar News