అప్పటి నుంచే బాబు మీద కేసులు... జగన్ చెప్పిన కొత్త పాయింట్...!

చంద్రబాబు మీద తాము కొత్తగా కేసులు పెట్టి జైలుకు పంపామని చెప్పడం టీడీపీ వారు నానా యాగీ చేయడం మీద జగన్ మండిపడారు

Update: 2023-10-09 09:34 GMT

చంద్రబాబు మీద తాము కొత్తగా కేసులు పెట్టి జైలుకు పంపామని చెప్పడం టీడీపీ వారు నానా యాగీ చేయడం మీద జగన్ మండిపడారు. వైసీపీ ప్రజా ప్రతినిధుల సభలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మీద కేసులు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడే ఉన్నాయని కొత్త పాయింట్ చెప్పారు. 2017, 2018 ప్రాంతంలో చంద్రబాబు స్కిల్ స్కాం విషయంలో మీద ఈడీ, సీబీఐ విచారణ చేశాయని ఆయన గుర్తు చేశారు. ఇక అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా బాబు అవినీతి మీద ఏపీ సభలలో మాట్లాడారని అన్నారు.

దీనిని బట్టి బాబు అవినీతి గురించి కేంద్ర పెద్దలకు నాడే తెలుసు అన్న్నారు. పైగా ఈడీ సీబీఐ జీఎస్టీ విచారణ కూడా అపుడే జరిగింది అన్నారు. ఈ విషయాల మీద పూర్తి అవగాహన ఉండబట్టే చంద్రబాబు తాను సీఎం గా ఉండగా సీబీఐ కి ఏపీలో నో ఎంట్రీ అంటూ జీవో ఒకటి తీసుకుని వచ్చారని ఫ్లాష్ బ్యాక్ కూడా జగన్ వినిపించారు.

మరి చంద్రబాబు తాను అవినీతి చేసి ఉండకపోతే తన మీద ఏ కేసు లేకపోతే ఎందుకు సీబీఐ విచారణను బాబు ఏపీలొ జరపకుండా అడ్డుకున్నారని ఒక వాలీడ్ పాయింట్ నే జగన్ లేవనెత్తారు. చంద్రబాబు అవినీతి గురించి తెలుసు కాబట్టే ఈడీ సీబీఐ నోటీసులు ఇచ్చాయని ఆయన స్పష్టం చేశారు.

నిజంగా చంద్రబాబు మీద అవినీతి కేసులు లేకపోతే ఆయన మీద వైసీపీ ప్రభుత్వం కక్ష సాధించే ధోరణిలోనే ఉంటే కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉందని, ఏపీ బీజేపీలో ఉన్న వారిలో సగం మందికి పైగా టీడీపీ వారే ఉన్నారని, వీరంతా అసలు ఊరుకునేవారా అని జగన్ నిలదీశారు.

చంద్రబాబు మీద ఆయన చేసిన అవినీతి మీద స్పష్టమైన ఆధారాలు ఉండబట్టే కోర్టులు రిమాండ్ విధించాయని జగన్ చెప్పాయి. చంద్రబాబు ఏ అవినీతి చేసినా అరెస్ట్ చేయరాదు అన్నది ఏ రకమైన వాదన అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుని సపోర్ట్ చేస్తున్న వారు అంతా పేదలకు వ్యతిరేకులని ఆయన అన్నారు.

పెత్తందారీ పోకడలు ఉన్న చంద్రబాబు దళితులలో ఎవరైనా పుట్టారా అని అంటారని, అలాగే బీసీలను పట్టుకుని తోకలు కట్ చేస్తాను అంటారని, ఆయన అహంకారాన్ని కూడా మద్దతు ఇచ్చే వారు అంతా సమర్ధిస్తున్నట్లే అని జగన్ పేర్కొన్నారు.

చంద్రబాబు అవినీతిని పచ్చ గజదొంగలే ఖండిస్తున్నాయని జగన్ చెప్పారు. వీరంతా బాబు అవినీతిలో భాగస్వాములని అంతా కలసి దోచుకో పంచుకో అన్న విధానం అవలంబిస్తున్నారని అన్నారు. మొత్తం మీద చూస్తే చంద్రబాబు అవినీతి మీద కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తి క్లారిటీ ఉందని అందుకే వారు ఆయనకు అప్పట్లోనే నోటీసులు ఇచ్చారని, తాము నాడు విపక్షంలో ఉన్నామని బాబు అరెస్ట్ వెనక వైసీపీ రాజకీయ కక్ష సాధింపు అన్నది లేనే లేదని జగన్ క్లారిటీ ఇచ్చినట్లు అయింది.

Tags:    

Similar News