బిగ్ బ్రేకింగ్... చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ - జనసేన - బీజేపీ కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 175 అసెంబ్లీ స్థానాల్లోనూ 164 స్థానాల్లో గెలుపొంది చరిత్ర సృష్టించింది కూటమి. మరోపక్క కేంద్రంలోనూ ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఢిలీలో పీఎంగా మోడీ, ఏపీలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారాలకు ముహూర్తాలు ఫిక్స్ అయ్యాయి.
అవును... ఈ నెల 9వ తేదీ ఆదివారం ఢిల్లీలో ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఇతర దేశాల అధినేతలు, ప్రధానులతో పాటు పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్ జెండర్లు, నూతన పార్లమెంట్ భవన నిర్మాణ కార్మికులు, వందేభారత్ ప్రాజెక్టులో పాలు పంచుకున్న కార్మికుల్లో కొంతమందిని ఆహ్వానించారు!
ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క ఏపీలో ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికోసం పార్టీనేతలు లొకేషన్ ను ఫిక్స్ చేశారు. ఇదే సమయంలో ముహూర్తాన్ని నిర్ణయించారు. ఇందులో భాగంగా... ఈ నెల 12 (బుధవారం) ఉదయం 11:27 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ బృహత్తర కార్యక్రమం కోసం గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద స్థలాన్ని ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, టీడీ జనార్థన్, పలువురు నేతలు సభాస్థలిని పరిశీలించారు. మరోపక్క ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మోడీ, పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు హాజరుకానున్నారని అంటున్నారు!
కాగా... సీఎంగా చంద్రబాబు జూన్ 9నే ప్రమణస్వీకారం చేస్తారని తొలుత భావించినట్లు వార్తలొచ్చాయి. అయితే... అదే రోజు ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో చంద్రబాబు తేదీ మార్చుకున్నారు. ఈ క్రమంలోనే జూన్ 12 ఉదయం సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.