పెన్షన్ పండుగ అంటే ఇదీ అంటున్న బాబు

చంద్రబాబు రాజకీయాలకు వ్యూహాలకు పెట్టింది పేరు. ఎవరైనా ఆయనని దాటి వెళ్ళలేరు.

Update: 2024-07-01 03:49 GMT

చంద్రబాబు రాజకీయాలకు వ్యూహాలకు పెట్టింది పేరు. ఎవరైనా ఆయనని దాటి వెళ్ళలేరు. పెన్షన్స్ అంటే తమకే పేటెంట్ అని వైసీపీ అయిదేళ్ల పాలనలో చెప్పుకుంది. అవ్వా తాతలు అంటూ ఎన్ని వందల వేల సార్లు జగన్ అని ఉంటారో లెక్కే లేదు. ఒక విధంగా వైసీపీకి పెన్షనర్లు శాశ్వత ఓటు బ్యాంక్ అని అనుకున్నారు. అతి ధీమాకు పోయారు.

అయితే వారితో ఎమోషనల్ కనెక్షన్ మాత్రం ఆయన ఎంత మేరకు పెట్టుకున్నారో తెలియదు. మొత్తానికి మూడు వేల పెన్షన్ ఇస్తున్నట్లుగా అది కూడా జనవరి 2024 నుంచి అని జగన్ చెప్పారు. అదే క్రెడిట్ అని ఆయన అనుకోవచ్చు. కానీ కేవలం మూదు నెలల తేడాలో ఆ పెన్షన్ ని నాలుగు వేలకు పెంచి బాబు వారికి దేవుడు అయిపోయారు.

ఎక్కడా దేశంలో లేని విధంగా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తున్న బాబు సంక్షేమ సారధిగానే మారారు. అంతే కాదు. పెన్షన్ పెంచడం ఉంటుంది కానీ ఎరియర్స్ అని పాత మూడు నెలల మొత్తాలని ఇవ్వడం ద్వారా పెన్షన్ అంటే పండుగగా మార్చిన ఘనత అక్షరాలా చంద్రబాబుకే దక్కుతుంది అని అంటున్నారు.

అంతే కాదు ఒక ముఖ్యమంత్రి పెన్షన్ ఇవ్వడం లబ్దిదారులను స్వయంగా కలసి వారి ముఖంలో ఆనందం చూడడం అంటే ఇది కూడా దేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు. దేశంలో ఈ రోజుకీ సామాజిక పెన్షన్ వేయి రూపాయలు ఇస్తున్న రాష్ట్రాలు అనేకం ఉన్నాయి. అంతే కాదు 66 లక్షలకు పైగా పెన్షన్లను ఏపీ ప్రభుత్వం ఇస్తోంది. ఇది అతి పెద్ద రికార్డు.

మిగిలిన రాష్ట్రాలో ఇంత పెద్ద సంఖ్యలో పెన్షన్ ఇవ్వడం లేదు. ఇక పదహారు రకాల కేటగిరీలలో పెన్షన్ ఇస్తున్నారు వికలాంగుల పెన్షన్ ఆరు వెలాకు చేశారు. కిడ్నీ బాధితులకు పెన్షన్ పది వేలకు చేశారు. ఇలా పెద్ద మొత్తంలో పెన్షన్ ఇవ్వడం ద్వారా వారిలో ఆత్మ విశ్వాసం పెంచారు.

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన అతి పెద్ద మంచి పని ఇదే అని చెప్పాలి. పైగా నెల రోజులు కూడా కాకుండానే ఈ విధంగా చేయడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. పెన్షన్లు తామే ఎక్కువ ఇస్తున్నామని తెల్లారేసరికి వాటిని అందిస్తున్నామని చెప్పుకునే వైసీపీ పెద్దలు ఇపుడు వీటిని చూసి ఏమంటారో అని అంటున్నారు.

జగన్ రెండు వేల నుంచి మూడు వేలకు పెన్షన్ చేయడానికి అయిదేళ్ళు తీసుకుంటే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేయడానికి చంద్రబాబు జస్ట్ మూడు నెలలు మాత్రమే తీసుకున్నారు అని అంటున్నారు. మరి ఈ విషయాలు అన్నీ అవ్వాతాతలకు తెలియకుండా ఉంటాయా అందుకే వారు ఎన్నికలకు ముందే జై కొట్టి బాబుని సీఎం గా చేసుకున్నారు అని అంటున్నారు. మొత్తానికి ఏపీలో సంక్షేమ విప్లవం వచ్చిందనే అంటున్నారు.

Tags:    

Similar News