నామినేటెడ్ పందేరంలో బాబు ఫార్ములా ఇదేనా ?

టీడీపీ అధినేత చంద్రబాబు ఢక్కామెక్కీలు తిన్న నాయకుడు. దాదాపుగా అయిదు దశాబ్దాల పాటు రాజకీయ అనుభవం ఉన్న నేత.

Update: 2024-07-19 03:21 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు ఢక్కామెక్కీలు తిన్న నాయకుడు. దాదాపుగా అయిదు దశాబ్దాల పాటు రాజకీయ అనుభవం ఉన్న నేత. చంద్రబాబు పదవుల పంపిణీ ఎపుడూ ఒక పద్ధతి ఉంటుంది. ఆషామాషీగా ఆయన ఎంపిక చేయరు. తాను ఎంచి పదవులు ఇచ్చిన వారిలో అనేక లక్షణాలను ఆయన చూస్తారు.

ఇక పదవుల పంపిణీలో అనేక క్రెడిటీరియాలు కూడా బాబు చూసుకుంటారు అని అంటారు. వేరే వారు ఎవరూ వంక పెట్టకుండా అది ఉంటుంది. ఆశావహులు మరీ ఎక్కువగా ఉన్న చోట కూడా అసంతృప్తి వ్యక్తం అయినా అధినాయకుడు అన్నీ ఆలోచించే చేశారు అనుకునేట్లుగా బాబు మార్క్ ఉంటుంది.

దీనికి అచ్చమైన ఉదాహరణ ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికలు. కూటమి కట్టాక 31 అసెంబ్లీ సీట్లు పది దాకా ఎంపీ సీట్లు మిత్రులకు ఇచ్చినా చంద్రబాబు పార్టీలో అసంతృప్తి వెల్లువగా లేకుండా చూసుకున్నారు. దానికి ఆయన అనుసరించిన పద్ధతులే ఆ విధంగా పార్టీలో సెగలు పొగలూ రాకుండా చూసాయని అంటున్నారు.

ఇపుడు కూడా నామినేటెడ్ పదవుల పంపిణీ విషయంలో చంద్రబాబు తనదైన ఫార్ములాను కనిపెట్టారు అని అంటున్నారు. అలా కనుక చేస్తే పార్టీలో ఎవరూ పెద్దగా మాట్లాడేందుకు వీలు ఉండదని బాబు భావిస్తున్నారుట. ఇంతకీ బాబు కనిపెట్టిన ఫార్ములా ఏమిటి అంటే సీనియర్లకు పెద్ద పీట వేయడం.

దాని కంటే ముందు త్యాగమూర్తులకు అందలం ఎక్కించడం. అంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ కోసం అయిదేళ్ళూ కష్టపడి మిత్ర్పక్షాలకు సీట్లు ఇచ్చినా కిక్కురుమనకుండా పనిచేసి కూటమికి విజయం సంపాదించి పెట్టిన వారికే మొదటి ప్రాధాన్య్త అని బాబు ఫిక్స్ అయ్యారని అంటున్నారు. అదే సమయంలో విధేయతకు పెద్ద పీట వేస్తున్నారుట.

పార్టీనే అట్టిపెట్టుకొని ఉంటూ కష్టకలాంలో జనంలో ఉంటూ టికెట్ దక్కకపోయినా బాబు ఇచ్చిన భరోసాతో మొక్కవోని దీక్షతో పనిచేసిన వారే తనకు కావాలని బాబు అనుకుంటున్నారు. వారికే నామినేటెడ్ పదవులు కట్టబెడితే వారికి న్యాయం చేసినట్లు అవుతుందని, పదవులకూ ఒక గౌరవం వస్తుందని భావిస్తున్నారుట.

దాంతో ప్రతీ జిల్లాలో త్యాగరాజుల వివరాలు సేకరిస్తున్నారు అని అంటున్నారు. అలాగే సీనియర్లుగా ఉంటూ పార్టీ మాట జవదాటని వారిని కూడా బాబు దగ్గర పెట్టుకోవాలని చూస్తున్నరుట. దీంతో బాబు ప్రయారిటీ ఇదీ అని తెలిసిన వారు అంతా తమకు గోల్డెన్ చాన్స్ దక్కబోతోంది అని సంబరంలో మునిగి తేలుతున్నారుట.

ఇక చూస్తే ఏపీలో వందకు పైగా వివిధ కార్పోరేషన్లు రూపేణా ఘనమైన చైర్మన్ పదవులు ఉన్నాయి. వీటిలో మెజారిటీ పోస్టులను తొలి విడతగా వారం రోజుల వ్యవధిలో బాబు భర్తీ చేస్తారు అని అంటున్నారు. ఆ తరువాత మరో జాబితా ఉండవచ్చు. దీంతో నామినేటెడ్ పదవుల కోలాహలం అయితే టీడీపీలో పెద్ద ఎత్తున కనిపిస్తోంది.

Tags:    

Similar News