అమ‌రావ‌తి కోసం.. ప్ర‌పంచ బ్యాంకుకు చంద్ర‌బాబు!

ఎలానూ ఇది కేంద్ర ప్రాజెక్టే కాబ‌ట్టి.. దీనికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే అవ‌కాశం ఉంది.

Update: 2024-06-20 14:30 GMT

ఏపీలో కొత్త‌గా బాధ్య‌త‌లు తీసుకున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. త‌క్ష‌ణం రెండు కీల‌క ప్రాజెక్టుల‌పై దృ ష్టి పెట్టారు. దీనిలో పోల‌వ‌రం, అమ‌రావ‌తి ప్రాజెక్టులు ఉన్నాయి. పోల‌వ‌రం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన చంద్ర‌బా బు అక్క‌డి ప‌రిస్థితిని స‌మీక్షించారు. నిర్మాణ వ్య‌యంపైనా చ‌ర్చించారు. దీనికి సంబంధించి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల‌ని చంద్ర‌బాబు దాదాపు నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఎలానూ ఇది కేంద్ర ప్రాజెక్టే కాబ‌ట్టి.. దీనికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే అవ‌కాశం ఉంది.

అయితే.. అత్యంత కీల‌కంగా భావిస్తున్న‌.. రాష్ట్రానికి సెల్ఫ్ ఇన్ క‌మ్ తెచ్చే ప్రాజెక్టుగా ఉన్న రాజ‌ధాని అమరావ‌తిని ప‌రుగులు పెట్టించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న తాజాగా గురువా రం ఇక్క‌డ ప‌ర్య‌టించనున్నారు. క్షేత్ర‌స్తాయిలో ప‌నులు ఎక్క‌డ ఆగిపోయాయి. గ‌త స‌ర్కారు అస‌లు ప‌ను లు ప‌ట్టించుకోక‌పోగా.. పూర్తిగా గాలికి వ‌దిలేసింది. దీంతో ఇప్పుడు జీరో లెవిల్ నుంచి రాజ‌ధానిని ప్రారంభించాల‌ని సీఎంచంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు.

అయితే. కేంద్రం నుంచి నిధులు ఏమేర‌కు వ‌స్తాయ‌నేది సందేహం. ఇప్ప‌టికే 1500 కోట్లు ఇచ్చామ‌ని చెబు తున్నారు. ఇక‌, మీద‌ట ఇచ్చినా.. ఈ రేంజ్‌లో ఇచ్చే అవ‌కాశం లేదు. దీంతో ప్ర‌త్యామ్నాయంగా చంద్ర బాబు ఆలోచ‌న చేస్తున్నారు. దీనిలో భాగంగా గ‌తంలో చంద్ర‌బాబు రుణం కోసం ప్ర‌పంచ బ్యాంకును ఆశ్ర యించారు. అయితే.. అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీ.. అనేక లేఖలు రాసి.. ప్ర‌పంచ బ్యాంకును దారి మ‌ళ్లించింది. దీంతో అప్ప‌ట్లో రుణ ప్ర‌తిపాద‌న‌కు బ్రేకులు ప‌డ్డాయి.

ఇక‌, 2019లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక‌.. అమ‌రావ‌తిని ఎంత నిర్ల‌క్ష్యం చేయాలో అంతా చేసేసింది. అయితే.. ఇప్పుడు రాజ‌ధానిని సాధ్య‌మైనంత వేగంగా పూర్తి చేయాల‌ని సంక‌ల్పం చెప్పుకొన్న చంద్ర‌బాబు గ‌తంలో మాదిరిగానే ప్ర‌పంచ బ్యాంకు నుంచి రుణం తెప్పించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌పంచ బ్యాంకు నుంచి రుణం తెచ్చుకుంటే.. త్వ‌ర‌గా పూర్తి చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు.

ఇదేస‌మ‌యంలో ఎన్నారైల ఉంచి మౌలిక ప్రాజెక్టుల‌కు పెట్టుబ‌డులు స‌మీక‌రించేందుకు కూడా చంద్ర బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇవ‌న్నీ క‌నుక సాధ్య‌మైనంత వేగంగా ప‌ట్టాలు ఎక్కితే.. అమ‌రావ‌తి ప్రాజెక్టు సాకారం అయ్యేందుకు పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది.

Tags:    

Similar News