చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల... ఫ్యామిలీ మెంబర్స్ ఆందోళన!

మరోపక్క చంద్రబాబు హెల్త్ కి సంబంధించి బులిటెన్ లు వద్దు టోటల్ రిపోర్ట్ కావాలంటూ ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Update: 2023-10-17 05:28 GMT

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై సోమవారం జైలు అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా... ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. మరోపక్క చంద్రబాబు హెల్త్ కి సంబంధించి బులిటెన్ లు వద్దు టోటల్ రిపోర్ట్ కావాలంటూ ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.


అవును... రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఐదవ రోజు హెల్త్ బులిటెన్ ను సెంట్రల్ జైల్ ఇంఛార్జీ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ సోమవారం రాత్రి విడుదల చేశారు. ఇందులో భాగంగా... బీపీ, పల్స్, రెస్పిరేటరీ రేట్, ఎస్పీవో 2, లంగ్స్, వెయిట్ మొదలైన వాటికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. మరోపక్క షుగర్ లెవెల్స్ కి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఐదో రోజు చంద్రబాబు హెల్త్ బులిటెన్ వివరాలు:

బీపీ: 136/80

పల్స్: 64/మినిట్

రెస్పిరేటరీ రేటు: 12/మినిట్

ఎస్పీవో 2: 97 శాతం

గుండె: ఎస్ 1, ఎస్2 ప్లస్

లంగ్స్: క్లియర్

టెంపరేచర్: సాధారణం

ఫిజికల్ యాక్టివిటీ: గుడ్

వెయిట్: 67 కిలోలు

ఆ సంగతి అలా ఉంటే... టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు ఆయనను ఆన్‌ లైన్‌ ద్వారా మంగళవారం తమ ముందు హాజరుపరచాలని రాజమండ్రి సెంట్రల్ జైల్ అధికారులను విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో ఇక మీదట హెల్త్ బులిటెన్ కాపీని చంద్రబాబుకు అందజేయాలని పేర్కొంది. ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ఈ మేరకు అధికారులను ఆదేశించారు.

అంతకుముందు... ఈనెల 14న చంద్రబాబు తనకు అస్వస్థతగా ఉందని, స్కిల్ అలర్జీ వచ్చిందని ఫిర్యాదు చేయడంతో... ఆయన్ను పరిశీలించిన రాజమండ్రి జీజీహెచ్ కు చెందిన వైద్య బృందం పరీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు ఇచ్చిన హెల్త్ రిపోర్ట్ ను తమకు కూడా ఇవ్వాలని బాబు కుటుంబ సభ్యులు అడిగారు. అయితే అందుకు జైలు అధికారులు నిరాకరించారట!

ఇందులో భాగంగా ఆ రిపోర్ట్స్ ఇవ్వడానికి కోర్టు అనుమతి తీసుకోవాలని జైలు అధికారులు సూచించారట. దీంతో... చంద్రబాబు హెల్త్ రిపోర్ట్స్ తమకు ఇవ్వడానికి అధికారులు నిరాకరిస్తున్నారని, అవి పొందాలంటే న్యాయస్థానం నుంచి పర్మిషన్ తీసుకోవాలంటున్నారని పేర్కొంటూ ఆయన తరుపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ వేశారు.

దీంతో... చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు మంగళవారం ఆయన్ను ఆన్‌ లైన్‌ ద్వారా తమ ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Tags:    

Similar News