చంద్ర‌బాబుపై 'ఇండియా' కూట‌మి ఆశ‌లు!

గ‌త ఎన్నిక‌లతో పోల్చుకుంటే.. ప్ర‌స్తుతం ఇండియా కూట‌మి పార్టీలు సీట్లు, ఓట్లు కూడా బాగానే సంపా యించుకున్నాయి

Update: 2024-06-05 12:00 GMT

కేంద్రంలో ప‌దేళ్ల త‌ర్వాతైనా అధికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో వ్య‌వ‌హ‌రించిన కాంగ్రెస్ పార్టీ.. ఈక్ర‌మంలో కొంత తాను త‌గ్గి అయినా.. కూట‌మిని ఏర్పాటు చేసుకుంది. వివిధ పార్టీల‌తో క‌లిసి.. ఇండి యా కూట‌మిగా ఏర్ప‌డింది. దీనిలో ఢిల్లీ అధికార పార్టీ ఆప్‌, ప‌శ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్‌, త‌మిళ‌నాడు అధికార పార్టీ.. డీఎంకే, యూపీకి చెందిన ఎస్పీ, బిహార్‌కు చెందిన ఆర్జేడీ పార్టీలు ఉన్నాయి. ఇంకా చాలానే పార్టీలు చేతులు క‌లిపాయి.

గ‌త ఎన్నిక‌లతో పోల్చుకుంటే.. ప్ర‌స్తుతం ఇండియా కూట‌మి పార్టీలు సీట్లు, ఓట్లు కూడా బాగానే సంపా యించుకున్నాయి. మోడీ నేతృత్వంలోని బీజేపీ పెట్టుకున్న 400 సీట్ల ల‌క్ష్యాన్ని నిలువ‌రించ‌డంలోనూ.. ఏక ప‌క్షంగా 2014, 2019లో వ‌చ్చిన‌ట్టు బీజేపీభారీ సంఖ్య‌లో సీట్ల‌ను కొల్ల‌గొట్ట‌కుండా చేయ‌డంలోనూ ఇండి యా బాగానే ప‌నిచేసింది. ఫ‌లితంగా ఎన్డీయే కూట‌మిని 293 స్థానాల వ‌ద్దే నిలువరించింది. అయితే.. ఇండియా కూట‌మికి 233 స్థానాలు వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో తాము అధికారంలోకి వ‌చ్చేందుకు.. ఇత‌ర ప్రాంతీయ పార్టీల మ‌ద్దతును ఇండియా కూట‌మి కోరుకుంటోంది. ఈ నేప‌థ్యంలో ఇండియా కూట‌మిలోని పార్టీలు.. ఏపీవైపు చూస్తున్నాయి. ఇక్క‌డ చంద్ర‌బాబు నేతృత్వంలోని టీడీపీ గుండుగుత్త‌గా 16 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంది. జ‌న‌సేన రెండు, బీజేపీ రెండు చోట్ల విజ‌యం ద‌క్కించుకున్నాయి. దీంతో టీడీపీ త‌మ‌తో చేతులు క‌లుపుతుంద‌నే ఆశ‌లు ఇండియా కూట‌మిలో క‌నిపిస్తున్నాయి.

ఈ విష‌యాన్ని ఉటంకిస్తూ.. మ‌హారాష్ట్ర మాజీసీఎం, యూబీటీ శివ‌సేన అధ్య‌క్షుడు ఉద్ద‌వ్ ఠాక్రే తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చంద్ర‌బాబు నాయుడు ఇండియా కూట‌మిలో చేర‌తార‌ని భావిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. బీజేపీ వేధింపుల‌కు గురైన వారంతా త‌మ‌త చేతులు క‌లుతార‌ని, ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు కూడా.. ఒక‌ప్ప‌టి మోడీ బాధితుడే కాబ‌ట్టి.. త‌మ‌తో క‌లిసి వ‌స్తార‌ని ఆశిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

ఇండియా కూట‌మి స‌మావేశం అనంత‌రం.. త‌మ ప్ర‌ధాని అభ్య‌ర్థిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. అయితే... ఉద్ధ‌వ్ చెప్పిన‌ట్టు.. చంద్ర‌బాబు ఇండియాతో క‌లుస్తారా? అంటే.. అలాంటి ప‌రిస్థితి లేద‌ని.. టీడీపీ వ‌ర్గాలు.. మంగ‌ళ‌వారం నుంచి చెబుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. రాజ‌కీయాల్లో శాశ్వ‌త స్నేహితులు ఉండ‌ర‌న్న‌ట్టుగా ఏమైనా జ‌ర‌గొచ్చ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News