బాబు కేసు క్రిటికల్ చేస్తున్నదెవరు...?

తముళ్ళు అనుకున్నట్లుగా చాలా ఈజీగా బయటకు రావాల్సిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో కూరుకుపోతున్నారు

Update: 2023-09-26 03:57 GMT

తముళ్ళు అనుకున్నట్లుగా చాలా ఈజీగా బయటకు రావాల్సిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో కూరుకుపోతున్నారు. రోజులు గడచినా ఆయన బయట ముఖం చూడడంలేదు. సూర్యోదయాలు చంద్రోదయాలు అన్నీ జైలు గోడల మధ్యనే గడచిపోతున్నాయి. చంద్రబాబు ఎందుకు ఇలా రిమాండ్ లో ఉండిపోతున్నారు అన్నదే ఇక్కడ కీలకమైన పాయింట్.

బాబు తరఫున యోధానుయోధులైన న్యాయవాదులు ఎందరు వాదిస్తున్నా కూడా ఈ కేసు ఒక కొలిక్కి రావడం లేదు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మ్యాటర్ సీరియస్ గా ఉన్నపుడు వాదించే విషయంలో విషయం వేరేది ఉన్నపుడు రిజల్ట్ తేడాగా వస్తుందని అంటారు. బాబు కేసులో అదే జరుగుతోందా అన్న చర్చ జరుగుతోంది.

తమాషా ఏంటి అంటే బాబు కేసులో ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. అవి కూడా ఏపీ సీఐడీ కంటే ముందే ఈడీ ఎంటరై శోధించిన తీరుతో లభ్యమైన వివరాలు. ఈడీ స్కిల్ స్కాం కేసులో పలువురిని అరెస్ట్ చేసింది. అలా ఈ కుంభకోణంలో తరువాత ఫేజ్ లో ఏపీ సీఐడీ దర్యాప్తు జరుపుతోంది అని అంటున్నారు.

సో అసలు ఆధారాలు లేవు అని ఈ కేసులో ఆది నుంచి టీడీపీ చేస్తున్న వాదనలో పస ఉందా అంటే వారిది రాజకీయ బాధగా చూడాలని అంటున్నారు. మరి ఈ కేసులో లోతుల్లోకి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయని అంటున్నారు. వాటిని ఈడీ అన్వేషించింది కూడా అని మాట వినిపిస్తోంది.

ఈ కేసులో సుదీర్ఘమైన దర్యాప్తు జరిగింది అన్నది కూడా మరవరాదు అంటున్నారు. అయితే టీడీపీ వారి వాదనలను మరోలా చూడవచ్చు. ఈ కేసులో బాబుకు ఎంతవరకూ సంబంధం అన్నది ఇక్కడ పాయింట్ గా చూడవచ్చు. బాబు సంతకాలు పెట్టవచ్చు. లేదా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇంటరెస్ట్ చూపించవచ్చు. కానీ ఆయనే అంతిమ లబ్దిదారుడని, ఆయన వైపుగానే ఈ కేసులో స్వాహా అయిన మొత్తాలు వచ్చి చేరాయని అంటే మాత్రం దాన్ని నిరూపించడానికి ఏపీ సీఐడీ చాలా పరిశ్రమ చేయాల్సి ఉంటుంది.

అలా కనుక చూసుకుంటే బాబు సతీమణి భువనేశ్వరి అన్నట్లుగా మాకు ప్రజల సొమ్ము తీసుకునే ఖర్మ ఎందుకు అన్న పాయింట్ మీద వాదించవచ్చు. అలాగే తెలంగాణాకు చెందిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నట్లుగా ముష్టి 371 కోట్ల రూపాయల కోసం బాబు ఇలా చేస్తాడా అని వాదించినా వాదించవచ్చు.

ఇలా బాబు తరఫున లాయర్ల వాదన ఉంటే ఆయనకు న్యాయం లభిస్తుంది అని అంటున్నారు. అయితే అసలు అవినీతి లేదు, ఏ తప్పు చేయలేదు అని భీష్మించుకుని కూర్చుంటే మాత్రం ఈ కేసు మరింత జఠిలం అవుతుంది అనే అంటున్నారు. అలా చేస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది అంటున్నారు.

ఈ కేసులో సీఐడి ఆధారాలు ఉన్నాయని అంటోంది. దాంతో ఒక ముఖ్యమంత్రికి ఈ కేసులో ఎంతవరకూ సంబంధం, ఆయన ఈ కేసులో ఎంతవరకూ ఇన్వాల్వ్ అయ్యారు లేక ఆయన ప్రమేయం ఏమీలేదు అన్నది గట్టిగా వాదించినట్లు అయితే కచ్చితంగా బాబుకు మేలు జరుగుతుంది. అంతే తప్ప అసలు స్కాం జరగలేదు అని ఒకే పాట పాడడం వల్ల ఉపయోగం ఎంతవరకూ ఉంటుందో ఆలోచించాల్సిన అవసరం ఉందనే అంటున్నారు.

Tags:    

Similar News