పవన్ పార్టీకి చంద్రబాబు ఇచ్చే సీట్లు...!?
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం 24 దాకా అసెంబ్లీ సీట్లు రెండు ఎంపీ సీట్లు ఇస్తామని పేర్కొన్నారు అని అంటున్నారు
తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో సేఫ్ గేమ్ నే ప్లాన్ చేసింది అనిపిస్తోంది. ఎందుకంటే మొత్తం 175 సీట్లకు గానూ ఎట్టి పరిస్థితుల్లోనూ 140 సీట్లకు తగ్గకుండా టీడీపీ పోటీ చేయాలని చొస్తోంది. అందుకోసం జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుంది అన్నదే ఇప్పటిదాకా చర్చలో ఉన్న విషయం. టీడీపీ నుంచి ఎక్కువ నంబర్ సీట్లు తీఎసుకోవాలని జనసేన భావిస్తోంది అని అంతా ప్రచారం సాగింది.
అవి యాభై నుంచి అరవై సీట్ల దాకా ఉంటాయని అంతా భావించారు. ఇదిలా ఉంటే చంద్రబాబు దాదాపు పదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి అన్ని విషయాలు చర్చించి పొత్తుని పూర్తి స్థాయిలో విజయన్వంతం చేసుకున్నారు అని అంటున్నారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలలో జనసేన తమ పార్టీకి 45 సీట్లు దాకా ఇవ్వాలని ప్రతిపాదన ఉంచింది.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం 24 దాకా అసెంబ్లీ సీట్లు రెండు ఎంపీ సీట్లు ఇస్తామని పేర్కొన్నారు అని అంటున్నారు. అది కాస్తా చివరికి 28 సీట్ల దగ్గర ఆగింది అని అంటున్నారు. అలాగే రెండు ఎంపీ సీట్లు కచ్చితంగా టీడీపీ జనసేనకు ఇస్తుందని అంటున్నారు. అయితే రౌండ్ ఫిగర్ చేయాలని అంటే 30 సీట్లు ఇవ్వాలని జనసేన కోరినప్పటికీ చంద్రబాబు బీజేపీ పొత్తు గురించి తేల్చుకున్న తరువాత ఇస్తామని చెప్పారని ప్రచారం సాగుతోంది.
అంటే టోటల్ 175 ఎమ్మెల్యే సీట్లలో జనసేనకు 28 సీట్లు ఇచ్చిన టీడీపీ బీజేపీ కనుక పొత్తులోకి వస్తే ఆరేడు సీట్లు ఇస్తారని అంటున్నారు. టోటల్ గా ఈ రెండు పార్టీలకు కలిపి 35 సీట్లు ఇచ్చి మిగిలిన 140 సీట్లలో టీడీపీ పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. ఇక బీజేపీ కనుక పొత్తులకి కలసి రాకపోతే మరో రెండు సీట్లు జనసేనకు ఇచ్చి 145 సీట్లలో టీడీపీ పోటీ చేస్తుంది అని అంటున్నారు.
సో ఈ మొత్తం 145 సీట్లలో టీడీపీ మ్యాజిక్ ఫిగర్ ఉన్న 88 సీట్లను గెలుచుకోవడం సులువు అని భావిస్తోంది. ఎందుకంటే పొత్తు పార్టీ జనసేన వల్ల ఓట్ల చీలిక ఉండే చాన్స్ లేదు అని భావిస్తోంది. 2014లో కూడా ఇలాగే జరిగింది అని లెక్క వేస్తోంది. ఇక బీజేపీ పొత్తులోకి రాకపోతే కాంగ్రెస్ కమ్యూనిస్టులను కలుపుకుని వారికి కూడా ఆ సీట్లను సర్దుబాటు చేసే అవకాశం ఉంది.
ఏ విధంగా చూసినా కూడా టీడీపీ సేఫ్ జోన్ లో ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే జనసేనకు ఇచ్చిన సీట్లలో ఎక్కువ సీట్లు గతంలో ప్రజారాజ్యం పార్టీ గెలుచుకున్న సీట్లను ఇవ్వడానికి టీడీపీ అంగీకరించింది అని అంటున్నారు. అంటే నాడు 18 సీట్లు పీఆర్పీ గెలుచుకుంది. అయా సీట్లు అన్నీ ఎక్కువగా గోదావరి ఉత్తరాంధ్రా జిల్లాలలో ఉన్నాయి.
అలా చూస్తే జనసేన కూడా కన్ ఫర్మ్ గా వచ్చే అసెంబ్లీలో పదుల సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుని బలమైన పార్టీగా అడుగుపెడతామని భావిస్తోంది. అలా చూస్తే కనుక పవన్ పార్టీకి ఈ సీట్లు ఈ నంబర్ ఆమోదయోగ్యమేనా అంటే ఓకే అనె ఆంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ తరచూ చెబుతున్నట్లుగా ఎన్నికల తరువాత సీఎం అన్నది ఈ తక్కువ నంబర్ సీట్లతో సాధ్యం అవుతుందా అన్నది చూడాల్సి ఉంది. మరి పవన్ సీఎం కారు అంటే జనసైనికులు ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూడాల్సి ఉంది.