రెండో రోజు బాబు హెల్త్ బులిటెన్... పోలీస్ సీరియస్ వార్నింగ్!

అవును... స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే

Update: 2023-10-14 04:03 GMT

శుక్రవారం ఉదయం నుంచి రాత్రి కోస్తా జిల్లాల జైళ్ల శాఖ డీఐజీ, స్థానిక ఎస్పీతోనూ, రాజమండ్రి జీజీహెచ్ వైద్యులతోనూ ప్రెస్ మీట్ పెట్టే వరకూ... చంద్రబాబు ఆరోగ్యంపై రచ్చ రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అసలు జైల్లో నాలుగు గోడల మధ్య ఉన్న వ్యక్తి, చీమకు కూడా చూడటానికి ఛాన్స్ లేనటువంటి గురించి లైవ్ లో చూసినట్లుగా కొంతమంది చేసిన కామెంట్లతో శుక్రవారం అంతా బాబు బరువు వ్యవహారాలు నడిచాయి.

అయితే... వీటిపై తీవ్రస్థాయిలో రియాక్షన్ వచ్చింది. చంద్రబాబు బరువు ఐదు కిలోలు తగ్గారనే విషయంపై అటు ప్రభుత్వ పెద్దలు, ఇటు వైసీపీ నాయకులు సీరియస్ గా రియాక్ట్ అయితే... పోలీస్ అధికారులు అసహనం ప్రదర్శించారు. ఇకపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని కాస్త గట్టిగానే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రెండో రోజు చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదలైంది.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై రెండో రోజు హెల్త్ బులిటెన్ విడుదలైంది. ఈ మేరకు జైలు ఇంఛార్జీ సూపరింటెండెంట్ రాజ్ కుమార్.. ఈ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యంపై కొంతమంది చేసిన ఆరోపణలపై జైలు అధికారులు క్లారిటీ ఇచ్చారు.

ఇందులో భాగంగా... తమ దగ్గర చంద్రబాబు ఒక రిమాండ్‌ ఖైదీ మాత్రమే అని గుర్తుచేసిన అధికారులు.. కాకపోతే, హైప్రొఫైల్‌ ఖైదీకి ఇచ్చే అన్ని సౌకర్యాలు ఇస్తున్నామని, తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని అన్నారు. ఇక కలుషిత నీటివల్లే బాబుకు స్కిన్ అలర్జీ అని చెప్పడంపైనా అధికారులు స్పందించారు. జైలులో 2036 మంది ఖైదీలు ఉన్నారని.. మరి వారికెందుకు రాలేదని ప్రశ్నించారు.

ఇక జైలులోపల చంద్రబాబు భద్రత కోసం పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపిన అధికారులు... చంద్రబాబు భద్రత కోసం ఒక హెడ్ వార్డర్, ఆరుగురు గార్డింగ్ సిబ్బందిని నియమించామని చెప్పారు. ఆయనను ఉంచిన బ్యారక్ లోకి ఏ ఇతర గార్డింగ్ సిబ్బందికి కూడా ప్రవేశం లేదని తెలిపారు. ఇక చంద్రబాబుకు భోజన సదుపాయం అందించడం, ఇతర వసతుల సమకూర్చడాన్ని ఈ అధికారి స్వయంగా పర్యవేక్షిస్తారని తెలిపారు.

ఇదే సమయంలో చంద్రబాబుకు రోజుకు మూడుసార్లు వైద్య పరీక్షలు చేయిస్తున్నామని, ఆయన ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్ చేస్తున్నామని తెలిపారు. అనంతరం... ఇకపై చంద్రబాబు ఆరోగ్యంపై ఎవరైనా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే తప్పుడు వార్తలు ప్రచారం చేసినవారినీ హెచ్చరిస్తున్నామని జైలు అధికారులు తెలిపారు!

చంద్రబాబు రెండో హెల్త్ బులిటెన్ వివరాలు:

బీపీ: 130/80

టెంపరేచర్: సాధారణం

పల్స్: 84/మినిట్

ఫిజికల్ యాక్టివిటీ: గుడ్

హార్ట్: ఏస్1 ఏస్2

లంగ్స్: క్లియర్

ఎస్పీఓ2జీ: 97 శాతం

కాగా తొలి రోజు హెల్త్ బులిటెన్ వివరాల ప్రకారం...

బీపీ: 140/80

టెంపరేచర్: సాధారణం

పల్స్: 87

ఫిజికల్ యాక్టివిటీ: గుడ్

హార్ట్: ఎస్1 ఎస్2

లంగ్స్: క్లియర్

ఎస్పీఓ2: 97 గా ఉన్న సంగతి తెలిసిందే!

Tags:    

Similar News