టీడీపీ ఓడిపోతే జరిగేది అదే...!?
కానీ వైసీపీ విషయంలో అది కనిపించడం లేదు సరికదా మరోసారి అధికారంలోకి వస్తుందని ఇప్పటిదాకా వెలువడిన సర్వేలలో మెజారిటీ చెబుతు న్నాయి
ఏపీలో ఎన్నికలు ఢీ అంటీ ఢీ అన్నట్లుగా సాగుతున్నాయి. హోరా హోరీ పోరుగా చెప్పవచ్చు. అయిదేళ్ళు పాలించి ఎన్నికలకు వెళ్తున్న ఒక పార్టీకి సాధారణంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉండాలి. కానీ వైసీపీ విషయంలో అది కనిపించడం లేదు సరికదా మరోసారి అధికారంలోకి వస్తుందని ఇప్పటిదాకా వెలువడిన సర్వేలలో మెజారిటీ చెబుతు న్నాయి.
ఏపీలో 2019లో 151 సీట్లలో వైసీపీ గెలిచింది. అందులో 51 సీట్లు కొట్టేసినా 100 సీట్లతో సింపుల్ మెజారిటీతో అయినా అధికారంలోకి వస్తుందని దీనికి ఎలాంటి లాజిక్కులు అవసరం లేదని కూడా చెబుతున్నారు జగన్ సైతం పట్టుదలగా ఉన్నారు. దాని కంటే ముందు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆయన ఎన్నికల రంగంలో నిలబడ్డారు.
ఇక చంద్రబాబు తరచూ ఒక మాట చెబుతూ ఉంటారు. తన రాజకీయ జీవితంలో ఎందో ముఖ్యమంత్రులను చూసాను జగన్ లాంటి వారిని చూడలేదు అని. అదే నిజం కూడా. జగన్ స్పెషల్ అనే చెప్పాలి. ఆయన మిగిలిన వారి కంటే చాలా భిన్నం. ఆయనకు అధికారం అందింది అంటే దానిని నిలబెట్టుకోవడానికే చూస్తారు. అంతే తప్ప అసలు పోగొట్టుకోరు.
చంద్రబాబుకు అధికారం మీద ఎంత మోజు ఉందో దానికి పది రెట్లు జగన్ కి ఉంది. పైగా జగన్ బాబు కంటే వయసులో చాలా చిన్న వారు. దూకుడు ఎక్కువ. ఈనాటి రాజకీయాన్ని ఆయన చేస్తున్నారు. ఆయన రాజకీయాన్ని తట్టుకోవడం కష్టమే అన్నది అర్ధం అవుతున్న విషయం. మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా కూడా ఏపీలో వైసీపీతో కూటమి సమ ఉజ్జీగా ముందుకు రాలేకపోతోంది.
ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఏపీలో మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందని అంతా అంటున్నారు. మరి వైసీపీ రెండవసారి వస్తే అపుడు టీడీపీ సంగతి ఏంటి అంటే ఏపీలో జూన్ 4 తరువాత పెను సంచలనాలే జరుగుతాయని అంటున్నారు. వైసీపీ గెలిచి టీడీపీ ఓడిపోతే మాత్రం ఏపీ రాజకీయ తెరపైన టీడీపీ దాదాపుగా అదృశ్యం కాక తప్పదని అంటున్నారు.
ఇక కేంద్రంలో ఎటూ బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని అంటున్నారు. ఆ పార్టీ పాత్ర ఏపీలో పూర్తి స్థాయిలో పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు ఏపీలో టీడీపీని విలీనం చేసుకోవడానికే టీడీపీ చూస్తుంది అని అంటున్నారు. అసలు పొత్తు ప్రతిపాదనతో టీడీపీ పెద్దలు ఢిల్లీ వెళ్ళినపుడు బీజేపీ పెద్దల నుంచి విలీనం ప్రతిపాదనే వచ్చింది అని అంటున్నారు.
అయితే ముందు పొత్తులకు ఒప్పించిన టీడీపీ రేపటి ఎన్నికల్లో గెలవకపోతే మాత్రం కచ్చితంగా బీజేపీ చెప్పిన ప్రతిపాదనలకు ఒప్పుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. అసలు ఏపీలో మరోసారి వైసీపీ వస్తుందన్న ఉద్దేశ్యంతోనే పవన్ ని ఎంపీగా పోటీ చేయమని బీజేపీ పెద్దలు చెప్పారని కూడా ప్రచారంలో ఉంది.
ఏపీలో రెండవసారి కనుక టీడీపీ ఓటమి పాలు అయి వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం జగన్ తన పట్టు మరింతంగా బిగిస్తారు. బాబు మీద కేసులను తిరగతోడతారు అని అంటున్నారు. వాటిని నుంచి రక్షించుకోవడానికైనా కేంద్ర బీజేపీ సాయం టీడీపీకి అవసరం అంటున్నారు.
సరిగ్గా అపుడే బీజేపీ టీడీపీని విలీనం చేసుకోవడనికి చూస్తుంది అంటున్నారు. అలా విలీనం అయితేనే ఏపీలో రాజకీయంగా వైసీపీని కట్టడి చేస్తామని ప్రతిపాదనలు పెడుతుందని అంటున్నారు. మొత్తానికి టీడీపీ ఓటమి పాలు అయితే కనుక విలీనం తప్పదని అంటున్నారు. ఇదే పరిస్థితి జనసేనకు ఉందని కూడా అంటున్నారు. ఆ పార్టీ కూడా ఓటమి పాలు అయితే ఇక పార్టీని నడపడం కష్టతరమే అంటున్నారు. మొత్తానికి జూన్ 4 తరువాత ఏపీలో తీవ్రమైన రాజకీయ పరిణామాలే చోటు చేసుకుంటాయని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత వరకూ నిజం ఉందో.