నెల రాజుగా చంద్రన్న కారాగార వాసం !
కానీ కాలం చిత్ర విచిత్రమైనది. చూస్తూండగానే బాబు నెల రాజు అయ్యారు. అంటే నెల రోజుల పాటు ఆయన జైలు జీవితం గా మారుతోంది.
గత నెల సెప్టెంబర్ 10 అర్ధరాత్రి సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలులోకి చంద్రబాబు అడుగుపెట్టినపుడు ఆయనతో పాటు అంతా అనుకున్నది మరుసటి రోజుకల్లా బయటకు వస్తారని. అసలు దానికి ముందు జరిగిన హడావుడి, విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి అర్ధరాత్రి బాబుని రాజమండ్రీకి తరలిస్తున్నపుడు కూడా చాలా మందిలో ఒక్కటే సంశయం. ఎటూ బాబు బయటకు వచ్చేదానికి ఇంత హంగామా అవసరమా అని.
కానీ కాలం చిత్ర విచిత్రమైనది. చూస్తూండగానే బాబు నెల రాజు అయ్యారు. అంటే నెల రోజుల పాటు ఆయన జైలు జీవితం గా మారుతోంది. సెప్టెంబర్ 9న అరెస్ట్ తో కలుపుకుంటే బాబు జైలు జీవితం అచ్చంగా ముప్పయి రోజులు అన్న మాటే. సుప్రీం కోర్టులో ఊరట లభిస్తుంది అనుకుంటే బాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ మీద విచారణ అక్టోబర్ 9కి వాయిదా పడిపోయింది.
దాంతో బాబు మరిన్ని రోజులు జైలులో గడాపాల్సిందే అంటున్నారు. ఇక క్వాష్ పిటిషన్ ని కోర్టు కొట్టేస్తే బాబు బెయిల్ కి అప్లై చెసుకోవాల్సి ఉంటుంది. అది ఎటూ ఏసీబీ కోర్టులో ఉంది. అక్కడ నో అంటే అపుడు అంచెలంచెలుగా మళ్లీ సుప్రీం కోర్టుకు రావాల్సి ఉంటుంది.
అలా న్యాయ ప్రక్రియలో భాగంగా బాబు ఇపుడు జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. ఆయన జైలు జీవితం కూడా పెరుగుతోంది. ఇక క్వాష్ పిటిషన్ మీద పట్టుదలగా టీడీపీ చంద్రబాబు ఉన్నారు. తన మీద సీఐడీ పెట్టిన కేసులు మొత్తానికి కొట్టేయాలని బాబు క్వాష్ పిటిషన్ ద్వారా కోరుతున్నారు.
ఇక ఈ కేసులో పూర్తిగా టెక్నికల్ రీజన్స్ మీద బాబు తరఫున న్యాయవాదులు వాదిస్తున్నారని అంటున్నారు. సెక్షన్ 17 ఏ కింద అవినీతి కేసులకు సంబంధించి గవర్నర్ కి సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేయరాదు అన్నది బాబు న్యాయవాదుల వాదన.. 2018 జూలై 26న ఈ రకమైన సవరణ అమలులోకి వచ్చింది.
అయితే ఏపీ సీఐడీ స్కిల్ స్కాం కేసును 2021లో విచారణ మొదలెట్టిందని, అందువల్ల 2018 నాటి సవరణ వర్తిస్తుందని బాబు న్యాయవాదులు అంటున్నారు. దాన్ని పూర్తిగా సీఐడీ తరఫున న్యాయవాదులు కౌంటర్ చేస్తున్నారు. బాబు కేసు ఏపీ ప్రభుత్వం కంటే ముందే సీబీఐ జీఎస్టీ వంటివి విచారించాయని చెబుతున్నాయి. ఇది 2017లోనే విచారణ మొదలైన కేసు అని గుర్తు చేస్తున్నారు.
ఆ విధంగా చూస్తే కనుక బాబుకు సెక్షన్ 17 ఏ సవరణ అప్లై కాదని అంటున్నారు. అంతే కాదు పీసీ యాక్ట్ తో పాటు ఐపీసీ కింద కూడా బాబు మీద పలు నేరాలు మోపబడ్డాయని అందువల్ల సెక్షన్ 17 ఏ ఎలా వర్తిస్తుంది అని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఈ కేసులో వాదనలు రెండు వైపులా బలంగా గట్టిగా ఉన్నాయి.
దాంతో బాబు కేసులో సుప్రీం కోర్టులో ఏ విధంగా తీర్పు వస్తుంది అన్న ఉత్కంఠ అయితే ఉంది. అక్టోబర్ 9న ఈ కేసు విచారణ జరిగి తీర్పు వస్తే కనుక బాబు నెల రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉంటూ బయటపడినట్లు. న్యాయ ప్రక్రియ ఏ మాత్రం ఆలస్యం జరిగినా లేక క్వాష్ పిటిషన్ ని డిస్మిస్ చేసినా కూడా బాబు ఎన్నాళ్లు జైలులో ఉంటారు అన్నదే తమ్ముళ్లలో చర్చగా ఉంది.