ప్లాన్ బీ రెడీ అంటున్న చంద్రబాబు... ఆ పార్టీలకు షాక్...?
చంద్రబాబుకి ఏపీ రాజకీయాల మీద అవగాహన ఉంది. మిత్రులు అని ఎవరనుకుంటున్నారో ఆయా పార్టీల మీద కూడా ఒక లెక్క ఉంది. దాని ప్రకారమే బాబు సీట్లను ఇస్తారని అంటున్నారు.
ఏపీలో చంద్రబాబు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన రాజకీయంగా గండర గండడు. ఎప్పటికి ఏది అవసరమో గుర్తించి అమలు చేసే రాజకీయం ఆయన సొంతం. అలాంటి చంద్రబాబు 2024 ఎన్నికల విషయంలో చాలా లోతుగానే ఆలోచిస్తున్నారు. పైగా వాస్తవిక ధోరణిలో ఆయన అలోచనలు ఉంటున్నాయని అంటున్నారు. చంద్రబాబు 2024లో ఒంటరిగా పోటీ చేయడానికి అయితే ఇష్టపడడంలేదు.
ఏ చిన్న అవకాశాన్ని సైతం వదులుకోవడానికి ఆయన రెడీగా లేరు అని అంటున్నారు. అంతమాత్రం చేత పొత్తుల పేరుతో ఎవరైనా అతి పెద్ద డిమాండ్లు పెడితే మాత్రం దానికి బాబు ఒప్పుకునేందుకు సిద్ధంగా లేరు అనే అంటున్నారు. చంద్రబాబుకి ఏపీ రాజకీయాల మీద అవగాహన ఉంది. మిత్రులు అని ఎవరనుకుంటున్నారో ఆయా పార్టీల మీద కూడా ఒక లెక్క ఉంది. దాని ప్రకారమే బాబు సీట్లను ఇస్తారని అంటున్నారు.
అంతకు మించి ఇచ్చేది ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే జనసేన ఏపీలో ఇపుడు మూడవ పార్టీగా బలంగా మారేందుకు చూస్తోంది. ఆ పార్టీ కనీసంగా యాభై సీట్లను కోరుకుంటోంది అని అంటున్నారు. అయితే అందులో సగం సీట్లనే పొత్తులో ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా ఉన్నారని అంటున్నారు. ఆ తరువాత బీజేపీ పొత్తులకు రెడీ అంటే ఆ పార్టీకి కూడా పది సీట్ల దాకా ఇస్తారని అంటున్నారు. అంటే మొత్తం మీద మిత్రులకు 35 సీట్ల దాకా ఇచ్చి 140 సీట్లకు పోటీ చేయాలన్నదే బాబు ఆలోచన అని చెబుతున్నారు.
అలా చేస్తే కనుక కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరం అయిన 88 సీట్ల మ్యాజిక్ ఫిగర్ ని అందుకోగలమని బాబు భావనగా ఉంది అని అంటున్నారు. దాంతో ఆయన ఈ పొత్తులు కనుక కుదిరితే దర్జాగా ఎన్నికల వైపు సాగిపోతారు. ఒకవేళ సీట్ల దగ్గర పితలాటకం వస్తే మాత్రం ప్లాన్ బీని అమలు చేస్తారు అని అంటున్నారు.
ఇక మిత్రులకు ఏ సీట్లు ఎక్కడ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయించేశారు అని అంటున్నారు. అంటే మిత్రులుగా కాబోయే వారు కోరుకున్న నంబర్ దక్కదు, కోరుకున్న చోట కూడా పోటీకి బాబు నూరు శాతం ఓకే చేయకపోవచ్చు అన్నదే ప్రచారంలో ఉన్న మాట. దాంతో పొత్తుల కధ ఎంతవరకూ సాగుతుందో ఎవరికీ తెలియదు.
ఈ కారణం చేతనే చంద్రబాబు మొత్తం 175 సీట్లలో బలమైన అభ్యర్ధులను ఇంచార్జులుగా నియమించారు అని అంటున్నారు. వారిని కూడా ఎన్నికల యుద్ధానికి ప్రిపేర్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇక బాబు మూడు విడతలుగా అభ్యర్ధుల జాబితా రిలీజ్ చేస్తారని అంటున్నారు.
దాంతో తో మిత్రులకు అవగాహన వస్తుంది అని భావిస్తున్నారు. ఇక తాము పోటీ చేసే సీట్లను అన్నింటినీ కూడా అభ్యర్ధులతో సహా అంతా సిద్ధం చేసి పెట్టుకుంటున్న బాబు చివరి నిముషంలో ఆ ముప్పయి అయిదు సీట్లకు కూడా పోటీ అంటే సై అన్నట్లుగానే అన్నీ చూసుకుంటున్నారుట. మొత్తానికి ఈ ప్రచారం బట్టి తేలేది ఏంటి అంటే మిత్రులుగా టీడీపీకి కాదలచుకున్న వారు ఆ పార్టీ కండిషన్లకు అంగీకరించి పోటీకి సిద్ధపడితేనే పొత్తు పొడుస్తుంది అని. లేకపోతే బాబు ఒంటరి పోటీకి కూడా రెడీ అని. సో ఇదన్న మాట అసలు విషయం.